Samantha : బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ప్రముఖ సెలబ్రిటీ టాక్ షో ‘కాఫీ విత్ కరణ్’. ఈ షో తాజాగా తన 7వ సీజన్‌ను ప్రారంభించింది. ఈ షోలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు.. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్‌తో కలిసి పాల్గొంది. ‘ఊ అంటావా మావా.. ఉఊ అంటావా మావా’ సాంగ్‌తో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఈ షోలో చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. నిజానికి ఈ షోకి సంబంధించిన ప్రోమో కొద్ది రోజుల కిందట విడుదలవడం.. ఆ తరువాత ఈ షో కోసం తెలుగు ప్రేక్షకులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూడటం జరిగింది. ఈ షో గురువారం రాత్రి స్ట్రీమింగ్ అయ్యింది.
Samantha : రామ్ చరణ్‌కి ఇంట్రెస్టింగ్ ట్యాగ్..
ఊహించినట్టుగానే సమంత ఈ షోలో నాగచైతన్యతో రిలేషన్ షిప్ గురించి పెదవి విప్పింది. సంచలన విషయాలు వెల్లడించింది. అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి అమ్మడు కీలక వ్యాఖ్యలు చేసింది. కరణ్ రాపిడ్ ఫైర్‌లో భాగంగా కొన్ని ప్రశ్నలకి ఒక్క మాటలో సమాధానం చెప్పాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా రామ్ చరణ్‌కి ఒక ఇంట్రెస్టింగ్ ట్యాగ్‌ని ఇచ్చింది. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చరణ్ గురించి ఒక్క మాటలో చెప్పాలని కరణ్ అడుగగా.. దానికి సమంత ‘ఓ జి’ అంటూ సమాధానం చెప్పింది. ఈ ‘ఓ జి’ అంటే చరణ్ ఒక ‘ఒరిజినల్ గ్యాంగ్ స్టర్’ అని ఆసక్తికరమైన ట్యాగ్‌ని ఇచ్చింది.
నిన్న వరకూ విడాకుల గురించి సమంత ఏం చెబుతుందా? అని ఎదురు చూసిన ప్రేక్షకులు ఇప్పుడు రామ్ చరణ్ గురించి చేసిన కామెంట్‌పై చర్చించుకుంటున్నారు. చెర్రీని గ్యాంగ్ స్టర్ అనడం వెనుక మతలబ్ ఏంటా అని మాట్లాడుకుంటున్నారు. అమ్మడు చెర్రీ సరసన ‘రంగస్థలం’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్‌ను అందుకుంది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్‌ను కూడా దర్శకుడు సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ప్రస్తుతం బాలీవుడ్లో బిజీ అయిపోయిన ఈ ముద్దుగుమ్మ సీక్వెల్‌కు ఓకే చెబుతుందో లేదో వేచి చూడాలి.