Rashi Khanna: టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు హీరోయిన్ రాశి ఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రాశి ఖన్నా మొదట ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న రాశి ఖన్నా తన అందం అభినయంతో యూత్ ని కట్టిపడేసింది.
ఆ తర్వాత హీరో గోపీచంద్ నటించిన జిల్ సినిమాతో ప్రేక్షకులకు కు మరింత చేరువ అయింది. ఈ సినిమా తరువాత ఈమె వరసగా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయింది. తెలుగులో శివమ్, ప్రతిరోజు పండగే, జోరు, బెంగాల్ టైగర్, సుప్రీమ్ లాంటి సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
అయితే ఈమె వరసగా సినిమాలలో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయినప్పటికీ ఆ సినిమాలు అన్నీ కూడా ఆమెకు అంతగా గుర్తింపును తెచ్చిపెట్టలేకపోయాయి. దీంతో రాశి ఖన్నా కెరియర్ లో చెప్పుకోదగ్గ ఒకటి కూడా లేదు. ఇకపోతే ఇటీవలే రాశి ఖన్నా పక్క కమర్షియల్, థాంక్యూ లాంటి సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది.
అయితే ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద ఊహించిన విధంగా డిజాస్టర్స్ గా నిలిచాయి. ఇది ఇలా ఉంటే రాశి కన్నా ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ అదరగొడుతోంది. ఇకపోతే రాశిఖన్నా ప్రస్తుతం వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోంది.
ఇది ఇలా ఉంటే తరచూ సోషల్ మీడియాలో మాత్రం రాశి ఖన్నా పేరు వినిపిస్తూనే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ఫోటోలను వీడియోలను పంచుకుంటూనే ఉంటుంది. ఈమెకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఆమె వైట్ కలర్ డ్రెస్ ను ధరించింది. అయితే వైట్ కలర్ డ్రెస్ లో తన డ్రెస్ ని పక్కకు జరిపి మరీ థైస్ అందాలు చూపిస్తూ రెచ్చగొడుతోంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.