సినీ పరిశ్రమకి ఎంతో మంది కథానాయికలు వస్తుంటారు వెళ్తుంటారు.. కానీ కొంత మంది మాత్రమే తమ పాత్రల ఎంపిక విధానం తో, ప్రతిభతో, తెరపై అద్భుతమైన నటనతో ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయికి నిలిచిపోతారు. అలాంటి అద్భుతమైన నటీమణుల్లో సమంత రుత్ ప్రభు ఒకరు. సౌత్ ఇండియా సినీ పరిశ్రమల్లో స్టార్ కథానాయికగా వెలుగొందిన సమంత.. ఆ తరవాత బాలీవుడ్‌కు వెళ్లి అక్కడ వెబ్ సిరీస్‌లు చేస్తున్నారు. ఒకవైపు డిజిటల్ ప్లాట్‌ఫాంలో సత్తాచాటుతూనే పాన్ ఇండియా లెవెల్ సినిమాల్లోనూ నటిస్తున్నారు.
![ఇండియాలో లాస్ట్‌లో రష్మిక మందన…టాప్ స్టార్ హీరోయిన్ ఎవరంటే..? 2 ఇండియాలో లాస్ట్‌లో రష్మిక మందన…టాప్ స్టార్ హీరోయిన్ ఎవరంటే..?](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/Untitled-design-2023-07-22T120432.005.jpg)
రష్మిక మందన :
‘ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ’ పాటతో ,‘పుష్ప’ సినిమాలో తెలుగు ప్రేక్షకులని మాత్రమే కాకుండా ఆల్ ఇండియా లెవెల్లో అన్ని భాషల్లోనూ ఓ ఊపు ఊపేశారు. ఇక ఆ తరవాత ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ సిరీస్‌లో నటించి పాన్ ఇండియా స్థాయిలో అందరినీ అలరించారు. ఇటీవల ‘శాకుంతలం’ సినిమాతో మరోసారి అబ్బురపరిచారు. ఇవన్నీ కలిపి ఆమెను ఇండియాలోనే అత్యంత జనాధారణ ఉన్న నటిని చేశాయి. ఈ ఏడాది జూన్ నెలకు సంబంధించి ORMAX మీడియా ప్రకటించిన ORMAX స్టార్స్ ఇండియా లవ్స్ (ఆల్ ఇండియా) జాబితాలో మన దేశంలో నెం.1 మోస్ట్ పాపులర్ ఫీమేల్ స్టార్‌గా సమంత నిలిచారు.
బాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు ఎంతో మంది స్టార్ హీరోయిన్లను తలదన్ని సమంత అగ్రస్థానంలో నిలబడ్డారు. అయితే, ఈ జాబితాలో అగ్రస్థానాన్ని ఆక్రమించడం సమంతకు కొత్తేమీ కాదు. ఇప్పటికే 8 సార్లు ఆమె ఫస్ట్ ప్లేస్‌లో నిలిచారు. అయితే, ఈ జూన్ జాబితాలో ఆలియా భట్ రెండో స్థానంలో ఉన్నారు. దీపికా పదుకొనె మూడు, నయనతార నాలుగు, కాజల్ అగర్వాల్ ఐదు, త్రిష ఆరు, కత్రినా కైఫ్ ఏడు, కియారా అద్వానీ ఎనిమిది, కీర్తి సురేష్ తొమ్మిది స్థానాల్లో నిలిచారు. ఇక ఆఖరి స్థానాన్ని ఇండియా క్రష్ రష్మిక మందన ఆక్రమించారు.
అయితే, ఈ జాబితాలో సమంత అగ్రస్థానంలో నిలవడంపై ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సమంత తోపు దమ్ముంటే ఆపు అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కానీ, కొందరు మాత్రం సమంతను ఎక్కువ చేసి చూపిస్తున్నారని విమర్శిస్తున్నారు. ఆమెకు అగ్రస్థానంలో నిలబడే అర్హత లేదని అంటున్నారు. ఏదేమైనా ఒక ప్రముఖ స్టార్ ఇలాంటి ఫీట్ సాధిస్తే పాజిటివ్, నెగిటివ్ రెండు కామెంట్లు వస్తుంటాయి. కాగా, సమంత ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషి’ సినిమాలో నటిస్తున్నారు. అలాగే, ‘సిటాడెల్’ అనే ఇంగ్లిష్ సిరీస్‌లోనూ ఆమె యాక్ట్ చేస్తున్నారు.