Rashmika Mandanna: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉంది. పుష్ప సినిమాతో తన బ్రాండ్ ఇమేజ్ ని ఏకంగా పాన్ ఇండియా రేంజ్ కి పెంచుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు చేతిలో పుష్ప 2 మూవీ ఉంది. దాంతో పాటు బాలీవుడ్ లో సందీప్ రెడ్డి వంగా రణబీర్ కపూర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ యానిమల్ లో కూడా నటిస్తుంది. ఈ రెండు సినిమాలతో పాటు తమిళంలో కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు హీరోయిన్ గా 2016లో కిరీక్ పార్టీతో అడుగుపెట్టింది. ఇక తెలుగులో రెండేళ్ళ తర్వాత చలో సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస అవకాశాలని సొంతం చేసుకుంది. గీతాగోవిందం సినిమా ఆమెకి స్టార్ హీరోయిన్ క్రేజ్ ని తీసుకొచ్చింది. ఇక తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబుకి జోడీగా సరిలేరు నీకెవ్వరు సినిమా ఆమెకి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇక పుష్ప మూవీ అయితే పాన్ ఇండియా ఇమేజ్ తీసుకొచ్చి హిందీలో కూడా ఆఫర్స్ రావడానికి కారణం అయ్యింది. పుష్ప తర్వాత హిందీలో ఏకంగా మూడు సినిమాలని రష్మిక చేసేసింది.
ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న యంగ్ హీరోయిన్ గా రష్మిక ఉంది. ఒక్కో సినిమాకి ఆమె 4 నుంచి 5 కోట్ల వరకు వసూలు చేస్తుందని టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ఇండస్టీలోకి అడుగుపెట్టిన తర్వాత ముఖ్యంగా టాలీవుడ్ ఎంట్రీ తర్వాత ఈ ఐదేళ్ళలో రష్మిక మందన భాగానే ఆస్తులు కూడబెట్టింది అని టాక్ ఇప్పుడు వినిపిస్తుంది. ముఖ్యంగా ఆమె సంపాదన అంతా ప్రాపర్టీస్ మీద పెట్టిందని సోషల్ మీడియాలో ఒక టాక్ నడుస్తుంది. దేశంలో ఐదు ప్రధాన నగరాల్లో ఆమె సొంతంగా ప్రాపర్టీస్ ని కొనుగోలు చేసిందని తెలుస్తుంది. గోవా, కూర్గ్, ముంబై, బెంగుళూరులో ఆమె ప్రాపర్టీస్ కొనుగోలు చేసిందనే మాట ఇప్పుడు చక్కర్లు కొడుతుంది. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది వేచి చూడాలి.