ఇటీవల పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయి టాలీవుడ్ లో రష్మిక మందన్న ఒక వెలుగు వెలుగుతోంది. అంతేకాదు బాలీవుడ్ లో కూడా వరుసగా అవకాశాలు అందుకొని సినిమాలు చేస్తుంది.. కోలీవుడ్ లో కూడా సత్తా చాటడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తమిళ అగ్ర నటుడితో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఇప్పటికే అన్ని చర్చలు పూర్తయ్యాయి అని , త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని చిత్రబృందం వెల్లడించింది. ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కొత్త సినిమాలో హీరోయిన్ గా ఎంపికైనట్లు సమాచారం.
అంతేకాదు ఈ సినిమాలో విజయ్ సేతుపతి కూడా కీలకపాత్ర పోషిస్తున్నారట. తాజాగా జూడ్ ఆంటోనీ జోసెఫ్ దర్శకత్వంలో సూపర్ హిట్ మలయాళ చిత్రం 2018. ఓ మల్టీ స్టారర్ సినిమాని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా చియాన్ విక్రమ్ , విజయ్ సేతుపతి, రష్మిక తో లైకా నిర్మాణ సంస్థ సంప్రదింపులు జరిపిందని, వారు కూడా ఒకే చెప్పినట్లు తెలుస్తోంది. ఇకపోతే విభిన్న వ్యక్తిత్వాలు కలిగిన వ్యక్తులకు సంబంధించిన కథాంశంతో ఈ సినిమా ఉంటుందని అయితే దీని గురించి కచ్చితంగా సమాచారం ఇంకా రావాల్సి ఉందని తెలుస్తోంది.ఇకపోతే రష్మికానీ ఆయన హీరోయిన్గా సెలెక్ట్ చేశారు కాబట్టి రష్మిక క్రేజ్ మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.