ముంబై హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై అర్నాబ్ గోస్వామి ఆధ్వర్యంలోని రిపబ్లిక్ టెలివిజన్ (ఏఆర్జీ ఔట్‌లియర్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్) తరపున సమర్పించిన వాదనలు ఈ నెల 4వ తేదీతో ముగిశాయి. ఆర్టీవి లోగో రిపబ్లిక్ TV లోగోను పోలి ఉందని, ఇది చట్టాన్ని ఉల్లంఘించడమే కాకుండా, తన సంస్థను కూడా దెబ్బతీస్తుందని పిటిషన్‌లో యజమాని పేర్కొన్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 4 వ తేదీ న ఆర్టీవి పేరుతో తాము యు ట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించారని, అయితే ఆ తర్వాత వచ్చిన ఆర్టీవి (రాయుడు విజన్) కూడా అదే పేరును ఉపయోయిస్తున్నారని పిటిషన్లో యాజమాన్యం పేర్కొన్నది. అందుకు గాను 100 కోట్ల మేర నష్టపరిహార దావా వేసింది. ఆర్టీవి లోగో లోని మూడు అక్షరాలని తొలగించాలని పిటిషన్లో పేర్కొన్నారు. రిపబ్లికన్ టెలివిజన్ యాజమాన్యం, న్యాయమూర్తి మనీష్ పిటాలే నేతృత్వంలోని సింగిల్ బెంచ్ ను, అత్యవసర నివేదిక గా భావించి దర్యాప్తులు చెప్పట్టాలని, ఇంజక్షన్ జారీ చేయాలని రిపబ్లిక్ టివి కోరగా. దాన్ని న్యాయమూర్తి తిరస్కరించారు. RTV అనుమతి కోసం కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు ఇప్పటికే దరఖాస్తు చేసిందని, దరఖాస్తు శాఖ పరిశీలనలో ఉందని పేర్కొని, తదుపరి సమావేశాన్ని జూన్ 5కి వాయిదా వేశారు.
తమ తరపున దాఖలు చేసిన దరఖాస్తులు ఫెడరల్ మినిస్ట్రీ వద్ద పెండింగ్ లో ఉందని, రిపబ్లిక్ టివి తరపున లోగో కు సంబంధించిన పిటిషన్ ఇంకా విచారణ జరుగుతుందని, కానీ ప్రస్తుతం మంత్రిత్వ శాఖ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవడం లేదని, ఆర్టీవి తరపు న్యాయవాధులు శరణ్ జగతియాని, హిరేన్ కామోద్ తదితరులు ఆరోపించారు.
అయితే RTV ప్రసారం ఇంకా ప్రారంభం కాలేదని, శాటిలైట్ టీవీ ఛానెల్‌లో దాని లోగోను చూపించలేదని వివరించారు. కాగా తదుపరి వాయిదా జూన్ 5 న జరగనున్నందున, ఆ లోపు రెండు పార్టీలు విచారణ అవసరమని భావిస్తే, విషయాన్ని మళ్లీ కోర్టుకు తీసుకురావచ్చని వివరించారు.
