మాస్ మహారాజ్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న హీరో అంటే వెంటనే రవితేజ అని చెబుతారు. తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ ని క్రియేట్ చేసుకొని స్టార్ హీరోగా ప్రస్తుతం కొనసాగుతున్న రవితేజ ప్రస్తుతం రామారావు ఆన్ డ్యూటీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై రవితేజ భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ మధ్య కాలంలో వచ్చిన రెండు సినిమాలు ఫ్లాప్ కావడంతో దీనిపై మాస్ రాజా గట్టి నమ్మకంతో ఉన్నారు. మళ్ళీ తన ఫామ్ ని ఈ సినిమాతో తిరిగి తెచ్చుకోవాలని అనుకుంటున్నారు. ఇదిలా ఉంటే గత కొంత కాలంగా రవితేజ మెగాస్టార్ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించబోతున్నాడు అనే టాక్ గత కొద్ది రోజులుగా వినిపిస్తుంది. దీనిపై విస్తృతం ప్రచారం కూడా జరుగుతుంది.
బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి వాల్తేర్ వీరయ్య అనే సినిమా చేస్తున్నసంగతి తెలిసిందే. ఈ సినిమాలో రవితేజ నటించబోతున్నాడు అని టాక్ నడిచింది. ఇక తాజాగా దీనిపై చిత్ర యూనిట్ ఒక వీడియోతో ఫుల్ క్లారిటీ ఇచ్చింది. రవితేజ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనేందుకు లొకేషన్ కి వచ్చిన వీడియోని ఒక టీజర్ తరహాలో రిలీజ్ చేసి కన్ఫర్మ్ చేశారు. 22 ఏళ్ల క్రితం క్రితం అన్నయ్య సినిమాలో రవితేజ చిరంజీవి తమ్ముడుగా నటించారు. ఈ సినిమా సమయానికి రవితేజ కేవలం ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అప్పుడప్పుడే నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి సమయంలో అన్నయ్య సినిమాలో కీలక పాత్రలో నటంచి మెప్పించారు.
ఇప్పుడు ఒక స్టార్ హీరోగా మెగాస్టార్ సినిమాలో కనిపించబోతున్నాడు. గతంలో శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అయితే ఆ సమయంలో రవితేజ బిజీ నటుడుగా ఉండటంతో చేయలేకపోయారు. మరల ఇన్నేళ్ళ తర్వాత రవితేజ ఫేవరేట్ నటుడు మెగాస్టార్ తో కలిసి నటించే అవకాశం రవితేజ సొంతం చేసుకున్నారు. మరి ఈ సినిమాలో ఇద్దరు స్టార్స్ కాంబినేషన్ తెరపై ఎ రేంజ్ లో ఉండబోతుంది అనేది వేచి చూడాలి.