గ్లోబల్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, కియారా అద్వానీ హీరోయిన్ గా స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో భారీ పాన్ ఇండియా సినిమా “గేమ్ ఛేంజర్” ఇప్పుడు చివరి దశకి చేరుకున్నదనే సంగతి అందరికీ తెలిసిందే. అలాగే ఈ భారీ చిత్రం అనంతరం మరో ఇంటెన్స్ సబ్జెక్టు తో అయితే చరణ్ రాబోతుండగా దానికి ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్నాడు.
![రామ్ చరణ్ మూవీకి ఏఆర్ రెహమాన్ ఫిక్స్..! 2 రామ్ చరణ్ మూవీకి ఏఆర్ రెహమాన్ ఫిక్స్..!](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/RC-02.jpg)
RC16 చిత్రంలో రామ్ చరణ్‌కు జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుందని , మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్‌గా కనిపించనున్నారని వార్తలు వెలువడుతున్నాయి. RC 16 సినిమా గురించి ఏ ఆర్ రెహమాన్ మాట్లాడుతూ ‘అవును. మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ సినిమాకు మ్యూజిక్ చేస్తున్నాను. ఇది చాలా ఎగ్జైటెడ్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్‌కు పనిచేయడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నా’ నని వెల్లడించారు . RC 16 కి ఏ ఆర్ రెహమాన్ సంగీత స్వరాలూ సమకూరుస్తున్నారని తెలిసిపోయింది . ఇంత వరకు పలు తెలుగు చిత్రాలకు స్వరాలను సమకుర్చారు .
ఇది వరకు నాగార్జున , మహేష్ బాబు , పవన్ కళ్యాణ్ మరియు నాగ చైతన్య సినిమాలకు సంగీతం అందించగా గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రామ్ చరణ్ సినిమాకి సంగీతం అందిస్తునందుకు చాగా గర్వాంగా ఫీల్ అవుతున్నాను. అయితే ఈ సినిమాకు సంభందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు గ్రాండ్ కాస్ట్ అండ్ క్రూ తో ప్లాన్ చేస్తున్న మేకర్స్ లేటెస్ట్ అన్నీ శరవేగంగా అయితే కంప్లీట్ చేస్తున్నారట.మరి వీటిపై మరిన్ని వివరాలు రావాల్సి ఉంది. ఇక ఈ భారీ చిత్రానికి గ్రాండ్ స్కేల్ లో వృద్ధి సినిమాస్ వారు మైత్రి మూవీ మేకర్స్ కో ప్రొడక్షన్స్ లో భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారని తెలిపారు .