కమెడియన్ రఘు :
కమెడియన్ రఘు గుర్తున్నారా? ఆయన కూతుళ్లను ఎప్పుడైనా చూసారా? సినిమా ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకోవడమే కష్టం అనుకుంటే.. కమెడియన్ గా రాణించడం అంటే ఇంకా కష్టమైనా విషయం. అవకాశాలు వచ్చిన వెంటనే సరిపోదు.. తనదైన కామెడీ టైమింగ్తో ప్రేక్షకులకు గుర్తుండిపోవడం అంటే అది తక్కువ మందికే సాధ్యం అని చెప్పుకోవచ్చు . ఆ తక్కువ మంది కమెడియన్ లలో రఘు కరుమంచి కూడా ఉన్నారు . అదుర్స్ సినిమాతో ఆయనకు బాగా పాపులారిటీ లభించింది.
ఎవరి సపోర్ట్ లేకుండానే రఘు సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయనకి అంత ఈజీగా అవకాశాలు రాలేదు. సాఫ్ట్ వేర్ రంగంలో సెటిల్ అయిన అప్పటికి .. అవన్నీ పక్కన పెట్టి సినిమాల్లో అవకాశాల కోసం చాలా ప్రయత్నాలు చేసేవారు. అదుర్స్ సినిమా ద్వారా ఆయనకు మంచి గుర్తింపు లభించడంతో పాటు తెలుగు ప్రేక్షకుల్లో ఆయన పేరు రిజిస్టర్ అయిపొయింది. జబర్దస్త్ కామెడీ షో కూడా రఘుకి మంచి గుర్తింపు ను తెచ్చిపెట్టింది. దాదాపు 200 ల సినిమాల్లో రఘు నటించారు.
సినిమాల్లో సరైన గుర్తింపు రాకపోవడంతో రఘు లిక్కర్ దందాలోకి దిగారు. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన వైన్ షాప్స్ వేలంలో రెండు షాప్స్ దక్కించుకుని బిజినెస్ స్టార్ట్ చేసారు. నల్గొండ జిల్లా మర్రిగూడ బైపాస్ సమీపంలో ఈ వ్యాపారం నడుస్తోంది. సినిమాల్లో నటిస్తున్నప్పుడే రఘు చాలా వ్యాపారాలు ప్రారంభించారు. షేర్ మార్కెట్ లో కూడా భారీగానే పెట్టుబడులు పెట్టారు. కానీ చాలా చోట్ల నష్టపోయారు. షేర్ మార్కెట్ లో కూడా బాగా నష్టం రావడంతో టెన్షన్ ఇంట్లో ఉన్న కంప్యూటర్ పగలగొట్టేశారంట . ఒక మూడు నెలలపాటు అసలు ఇంట్లోంచి బయటకే రాలేదట. రఘు హైదరాబాద్ లో పుట్టి పెరిగారు. అక్కడే ఎంబీఏ పూర్తి చేసుకుని సాఫ్ట్ వెర్ ఫీల్డ్ లో సెట్టిల్ అయిపోయారు . అప్పుడే ఆయనకు పెళ్లి అయ్యింది. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారిపేర్లు స్వప్నిక, తేజస్వి. సోషల్ మీడియాలో ఆక్టివ్ గానే ఉండే రఘు తన కూతుర్ల ఫోటోలు పంచుకున్నారు. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.