Biggboss 6: బిగ్‌బాస్ సీజన్ 6 మూడో వారానికి చేరుకుంది.అసలు సిసలైన ఘట్టం.. నామినేషన్స్ నిన్నపూర్తైంది. ఇక మిగిలింది.. కెప్టెన్సీ టాస్క్.నామినేషన్స్ రేంజ్లో ఉండొచ్చు. ఇది అంతకు మించి కూడా ఉండొచ్చు.. లేదంటే పేలవంగా సాగొచ్చు. కానీ ఈ వారం కెప్టెన్సీ టాస్క్ పేలవంగా సాగినట్టు కనిపించలేదు. బీభత్సమైన పోరే జరిగినట్టు కనిపిస్తోంది. దీనికి సంబంధించిన ప్రోమో కొద్ది సేపటి క్రితం విడుదలైంది. కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా సభ్యుల మధ్య వార్ జరిగింది. ఈ టాస్క్‌లో భాగంగా మాటల తూటాలు పేలుతుంటే మరోవైపు కొట్టడానికి చేతులెత్తే పరిస్థితులు సైతం చోటు చేసుకున్నాయి.
ఈ వారం ఆట ఉత్కంఠగా సాగబోతున్నట్లు కనిపిస్తోంది. తొలుత తాజా టాస్క్‌కు సంబంధించిన వివరాలను రేవంత్ వినిపిస్తాడు. ఈ వారం కెప్టెన్సీ టాస్క్ పేరు ‘అడవిలో ఆట’ ఈ టాస్క్‌లో కొంతమంది ఇంటి సభ్యులు పోలీసులుగా, మరికొందరు దొంగలుగా.. ఒకరు అత్యాశ ఉన్న బిజినెస్‌మెన్‌గా వ్యవహరించాలి. దొంగ, పోలీసుల మధ్య ఆట పెద్ద ఫైటింగ్కే దారి తీసినట్టు ప్రోమోను బట్టి తెలుస్తోంది. అత్యాశ ఉన్న బిజినెస్‌మెన్‌గా గీతూ రాయల్ ఉన్నారు. ఆట మొదలు కాగానే ‘నీవు చేేసదే దొంగ వ్యాపారం పైగా పోలీసులతో వాదిస్తావా’ అంటూ ఆదిరెడ్డి గీతూపై రెచ్చిపోయారు.
Biggboss 6: ‘వాడు’ అని అన్నప్పుడే ఒక్కటి ఇచ్చి ఉండాల్సింది
ఆ మాటలకు గీతూ తగ్గుతుందా? ‘నాతో మాట్లాడాలి అంటే రూల్ చూపించి మాట్లాడాలి’ అంటూ రెచ్చిపోయింది. ఆటలో ఆరోహి గాయపడింది. ఆమెను సూర్య భుజాన వేసుకుని హౌస్ లోకి ఎత్తుకుని వెళ్తారు. సత్యపై సూర్య విరుచుకుడ్డాడు. దొంగల టీంలో ఉన్న శ్రీహాన్, పోలీసుల టీంలో ఉన్న ఇనయా మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఈ పోరులో ‘వాడు’ అని సంబోధించినందుకు దొంగల టీంలో ఉన్న రేవంత్ పోలీస్ టీమ్ అయిన ఇనయాపై మండిపడ్డాడు.‘వాడు.. వీడు’ అని సంబోధించినందుకు రేవంత్, శ్రీహాన్ ఇనయాపై ఫైర్ అవుతాడు. ‘వాడు’ అని అన్నప్పుడే ఒక్కటి ఇచ్చి ఉండాల్సింది అంటే చెయ్య ఎత్తబోయాడు రేవంత్. ‘వాడేండి వాడు’ సరిగ్గా మాట్లాడటం రాదా? ఇంట్లోవాళ్లు మేనర్స్ నేర్పించలేదా? అంటూ ఫైర్ అయ్యాడు. ‘నన్ను కొడతా అని ఎలా అంటావ్’ అంటూ రేవంత్‌పై ఇనయా రెచ్చిపోయింది. మొత్తానికి కెప్టెన్సీ టాస్క్ పెద్ద యుద్ధానికే దారి తీసేలా ఉంది.