యువ సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ , మేనమామ పవర్ స్టార్ పవన కళ్యాణ్ తో కలిసి చేసిన మల్టీ స్టారర్ మూవీ “బ్రో” ఈ నెల 28 ఘనంగా విడుదల కాబోతుంది . ఈ సినిమాకు కి సంబంధించి ప్రమోషనల్ కంటెంట్ అభిమానుల్లో అంచనాలు పెంచేస్తోంది. ఇందులో పవన్ కళ్యాణ్‌లో గెస్ట్ రోల్ చేస్తున్నారని తెలిసిందే . ఇప్పటికే ‘విరూపాక్ష’ మూవీతో కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ ఖాతాలో వేసుకున్న తేజ్ మల్లి హిట్ కొట్టి మరో మైలు రాయి ని దాటాలని భావిస్తున్నాడు . తేజ్ విరూపాక్ష మూవీ తో వంద కోట్ల క్లబ్లో చేరగా, తన కెరీర్లో ఆఫీట్ సాధించిన మొదటి సినిమా ఇదే . తేజ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ టైటిల్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది .
![చీటీల చిన్నిగా సాయి ధరమ్ తేజ్ 2 చీటీల చిన్నిగా సాయి ధరమ్ తేజ్](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/Untitled-design-27.jpg)
తన కొత్త ప్రాజెక్ట్ తో కొత్త దర్శకుడు జయంత్ అనే వ్యక్తి పరిచయం కాబోతున్నాడు. అయితే ప్రస్తుతం ఈ మూవీకి ‘చీటీల చిన్ని’ అనే టైటిల్ ఖరారైనట్టు తెలుస్తోంది. ఇందులో తేజ్ చిన్నపాటి ఫైనాన్స్ వ్యాపారం చేసే యువకుడిగా కనిపించనున్నట్లు టాక్, సాక్షి వైద్య ఈ చిత్రంలో ఫిమేల్ లీడ్‌గా ఎంపికైనట్లు సమాచారం.
చీటీల చిన్ని’ మూవీ షూటింగ్ ఆగస్టులో ప్రారంభం కానుంది .
బీవీఎస్ఎన్ ప్రసాద్. గారు ఈ కామిక్ ఎంటర్టైనర్ను నిర్మించనున్నారు.ఇది వరకు ఇదే కాంబినేషన్ లో వచ్చిన ‘విరూపాక్ష’ చిత్రం పెద్ద సక్సెస్ అవ్వడం తో మల్లి అదే సక్సెస్ ఫార్ములా యూస్ చేస్తున్నారు . మొత్తానికి ‘చీటీల చిన్ని’ చిత్రీకరణ వచ్చే నెల నుంచి మొదలవుతుండగా .. 2024లో విడుదల కానుంది.