Salaar Movie: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఏకంగా ఐదు పాన్ ఇండియా సినిమాలని చేతిలో పెట్టుకొని ఉన్నాడు. అన్ని కూడా ఒకదానిని మించి ఒకటి ఉండబోతుంది. ఈ ఏడాది ఏకంగా రెండు సినిమాలని రిలీజ్ చేయబోతున్నాడు. అలాగే సంక్రాంతికి ప్రాజెక్ట్ కె మూవీతో రాబోతున్నాడు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ప్రభాస్ మీద ఏకంగా మూడు వేల కోట్ల వరకు బిజినెస్ జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ మూవీగా ప్రాజెక్ట్ కె తెరకెక్కుతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాని ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కిస్తున్నారు.
ఇక ఈ సినిమాని హాలీవుడ్ లో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీని ద్వారా మొట్టమొదటి ఇండియన్ హాలీవుడ్ హీరోగా ప్రభాస్ మారబోతున్నాడు అని చెప్పొచ్చు. అయితే అంతకంటే ముందుగానే ఆ క్రెడిట్ మరో సినిమా తీసుకునే ఛాన్స్ కనిపిస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డార్లింగ్ ప్రభాస్ చేస్తున్న సలార్ మూవీని ఇంగ్లీష్ లో రిలీజ్ చేయడానికి నిర్మాత విజయ్ కిరంగదూర్ సిద్ధం అవుతున్నారని తెలుస్తుంది.
ప్రశాంత్ నీల్ కి కూడా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారని, అతను కూడా ఒప్పుకున్నట్లు టాక్. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న సినిమా కావడంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులకి రీచ్ కావడానికి ఇంగ్లీష్ లో రిలీజ్ చేసి ఇండియన్ హాలీవుడ్ మూవీ అనే బ్రాండ్ గా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. దీనికోసం ప్రొఫెషనల్ ఇంగ్లీష్ డబ్బింగ్ ఆర్టిస్ట్స్ ని రంగంలోకి దించుతున్నారని తెలుస్తుంది. హాలీవుడ్ స్టాండర్డ్స్ లో డబ్బింగ్ ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు టాక్ నడుస్తుంది. అదే జరిగితే ప్రభాస్ ఇండియన్ ఫస్ట్ హాలీవుడ్ స్టార్ గా మారిపోతాడు అనడంలో ఎలాంటి అతిశాయోక్తి లేదని చెప్పాలి.