Salaar Movie: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సలార్. ఈ మూవీ షూటింగ్ చివరి దశకి వచ్చేస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబందించిన కీలక సన్నివేశాలని ప్రశాంత్ నీల్ తెరకెక్కించే పనిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే హై వోల్టేజ్ మూవీగా తెరకెక్కబోయే ఈ సినిమాని కేజీఎఫ్ నిర్మాతలైన హంబలే ఫిలిమ్స్ నిర్మిస్తుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ కోసం ఏకంగా 300 కోట్ల బడ్జెట్ పెడుతున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ మూవీని సెప్టెంబర్ 28న రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు.
పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కాబోయే ఈ మూవీపై భారీ హైప్ క్రియేట్ అయ్యి ఉంది. కచ్చితంగా ఈ సినిమా వెయ్యి కోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టే చిత్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబందించిన రిలీజ్ రైట్స్ కోసం అప్పుడే గట్టి పోటీ ఉందని చెప్పాలి. ఓవర్సీస్ లో ఈ మూవీ థీయాట్రికల్ రైట్స్ కోసం ఏకంగా 38 కోట్లు ఆఫర్ చేస్తున్నారని టాక్ నడుస్తుంది. అయితే మూవీ టీజర్ రిలీజ్ తర్వాత అయితే మరింతగా బిజినెస్ పెరిగే అవాకాశం ఉందని చిత్ర నిర్మాత భావిస్తున్నట్లు సమాచారం.
ఈ నేపధ్యంలో అప్పుడే తొందర పడకుండా వెయిట్ చేస్తున్నట్లు ప్రచారం నడుస్తుంది. ఈ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ ద్వారానే పెట్టిన పెట్టుబడి మొత్తం రాబట్టాలని టార్గెట్ గా నిర్మాత విజయ్, ప్రశాంత్ నీల్ పెట్టుకున్నట్లు తెలుస్తుంది. అందుకనే సినిమా టీజర్ ని గ్రాండ్ గా రిప్రజెంట్ చేసి సినిమా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచనలో ఉన్నట్లుగా ఫిల్మ్ నగర్ సర్కిల్ లో వినిపిస్తున్న మాట.