సలార్ ట్రైలర్ రిలీజ్‌పై మూవీ టీమ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్ను రివీల్ చేసింది. భారతీయ సినిమా వైభవాన్నీ చాటిచెప్పేలా ఈ ట్రైలర్ ఉంటుందని ప్రకటించింది.
సలార్ టీజర్‌కు మించి ట్రైలర్ ఉంటుందని సినిమా యూనిట్ ప్రకటించింది. సలార్ టీజర్‌కు అమెజింగ్ రెస్పాన్స్ రావడంతో టీమ్ ఆనందంలో మునిగిపోయింది. గురువారం రిలీజైన ఈ టీజర్ వంద మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకొని సంచలనం సృష్టించింది.
హయ్యెస్ట్ వ్యూస్ (Highest Views) సాధించిన ఇండియన్ మూవీ టీజర్‌గా (Teaser) రికార్డ్ క్రియేట్ చేసింది. టీజర్‌తో సినిమాపై ఉన్న అంచనాలు అమాంతం రెట్టింపయ్యాయి. తాజాగా సలార్ ట్రైలర్‌ను ఆగస్ట్‌లో రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్‌గా నిర్మాణ సంస్థ వెల్లడించింది. మీ క్యాలెండర్లో ఆగస్ట్ నెలను మార్క్ చేసుకొండి. భారతీయ సినిమా వైభవాన్ని చాటిచెప్పే అత్యంత ఆసక్తికరమైన ట్రైలర్ మీ కోసం వస్తోందిని ప్రకటించింది.
మన ఇండియన్ సినిమా శక్తిని చాటిచెప్పే ఈ ఆనందకరమైన ప్రయాణాన్ని కలిసి కొనసాగిద్దామని అభిమానులతో ట్విట్టర్ ద్వారా సలార్ టీమ్ ప్రకటించింది. టీజర్‌కు వంద మిలియన్ల వ్యూస్ రావడంపై సినిమా యూనిట్ స్పందించింది. భారతీయ సినిమా పరాక్రమానికి ఇదొక ప్రతీక అంటూ తెలిపింది.
సలార్ టీజర్ సృష్టించిన ప్రభంజనంలో మీరంతా భాగస్వాములయ్యి, మాపై మీరు చూపిన అపారమైన ప్రేమ, మద్దతు, అభిమానానికి ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటామని చెప్పింది. మీ అచంచలమైన మద్దతు మా అభిరుచిని మరింత పెంచి అసామాన్యమైన సినిమాను మీకు అందించాలనే మా కోరిక మరింత బలపడిందని సలార్ టీమ్ ట్విట్టర్లో పేర్కొన్నది.
సలార్ టీమ్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గ్యాంగ్‌స్టర్ యాక్షన్ ఎంటర్టైనర్గా దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) సలార్ మూవీని తెరకెక్కిస్తోన్నాడు. దాదాపు 200 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తోన్నాడు. జగపతిబాబు, శృతిహాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్‌గా ఈ మూవీ రిలీజ్ కానుంది.