అందరూ ఎప్పుడెప్పుడూ అని ఎదురుచూస్తున్న సలార్ ట్రైలర్ పై బిగ్ అప్డేట్ వచ్చేసిందోచ్ . ది మోస్ట్ అవెటెడ్ సినిమా గా ఇప్పటికే ట్యాగ్ వచ్చేలా చేసుకున్న సలార్ నుంచి..ట్రైలర్ రిలీజ్‌కు కూడా అడుగుపడింది. ఈ సినిమా ట్రైలర్ గురించి కోట్ చేస్తూ.. హోంబలే తాజాగా ఓ వీడియోను సోషల్ మీడియాలో వదిలిందంట . మరో సారి సోషల్ మీడియాను.. సలార్ మీడియాగా మారిపోయేలా చేసిందంట దాంతో పాటే.. డార్లింగ్ ఫ్యాన్స్‌ను ఎగిరి గంతేసేలా చేసింది. ఎస్ ! ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో..
ప్రభాస్ చేస్తున్న భారీ యాక్షన్ ఓరియెంటెడ్ పాన్ ఇండియన్ సినిమా సలార్. ఇక ఎప్పటి నుంచో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా.. సెప్టెంబర్ 28న వరల్డ్ వైడర్ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇక ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి ట్రైలర్ రిలీజ్ చేసేందుకు ఈ సినిమా ప్రొడక్షన్ హౌస్ హోంబలే రడీ అవుతుంది . అదే విషయాన్ని చెబుతూ.. తాజాగా తమ సోషల్ మీడియా హ్యండిల్లో ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఇక ఈ వీడియో చివర్లో సలార్ ట్రైలర్ కమింగ్ సూన్ అంటూ.. కోట్ చేసేసింది .