Salman Khan : డిసెంబర్ 27న బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచలర్ సల్మాన్ ఖాన్ 57వ ఏట అడుగుపెట్టారు. గత రాత్రి సినీ పరిశ్రమకు చెందిన సన్నిహితులు కుటుంబ సభ్యుల సమక్షంలో సల్మాన్ ఖాన్ తన పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు. స్టార్-స్టడెడ్ బాష్‌లో షారూఖ్ ఖాన్, హెగ్డే, కార్తీక్ ఆర్యన్, కృతి కర్బందా, పుల్కిత్ సామ్రాట్, టబు, సోనాక్షి సిన్హా, రితీష్ దేశ్‌ముఖ్, జెనీలియా డిసౌజా, ఆయుష్ శర్మ, సల్మాన్ సోదరి అర్పితా ఖాన్, సోదరులు అర్బాజ్ ఖాన్ లు ఉన్నారు.
ఈ పార్టీ ఈవెంట్‌కు హాజరైన తారలను తమ కెమెరాల్లో బంధించి ఫోటోగ్రాఫర్లు ఆ స్నిప్పెట్లను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. సల్మాన్ తన బర్త్ డే కేక్ కట్ చేస్తున్న వీడియోను కూడా షేర్ చేశారు.
సల్మాన్ సోదరి అర్పితా ఖాన్ ముంబై ఇంట్లో జరిగిన ఈ బర్త్‌డే పార్టీలో సల్మాన్ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి అందరిని ఆకట్టుకున్నారు. సెలబ్రిటీలు అందరూ నల్లటి దుస్తుల్లో ఈ పార్టీ ఈవెంట్ కు అటెండ్ అయ్యి అందరిని ఆకర్షించారు. ఈ ఈవెంట్ కోసం సంగీతా బిజ్లానీ మెరిసే నీలం రంగు దుస్తులలో కనిపించి మంత్రముగ్ధులను చేసింది. పార్టీ వేదిక వెలుపల ఆమె సల్మాన్‌తో కలిసి కనిపించింది, అక్కడ అతను ఆమెను కౌగిలించుకుని ఆమె నుదిటిపై ముద్దు పెట్టుకున్నాడు.
సోమవారం జరిగిన సల్మాన్ బర్త్ డే పార్టీకి షారూఖ్ ఖాన్ హాజరై స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. సల్మాన్, షారూఖ్ ఒకరినొకరు ఆలింగనం చేసుకోవడం చూసిన అభిమానులు ఉత్సాహాన్ని ఆపుకోలేకపోయారు.
షారుఖ్ ఖాన్ , సల్మాన్ ఖాన్ లు గత కొన్ని దశాబ్దాలుగా స్నేహితులు. వీరిద్దరూ ఎప్పుడు ఒకే ఫ్రేమ్‌లో కనిపించినా ఫ్యాన్స్ పండుగ చేసుకుంటుంటారు. సల్మాన్ పార్టీలోనూ షారూఖ్, సల్మాన్ ల క్యూట్ మూమెంట్స్‌ను వీడియోలు, ఫోటోలు తీసి ఫోటోగ్రాఫర్లు నెట్టింట్లో పోస్ట్ చేశారు. షారూఖ్ , సల్మాన్‌ను ఆప్యాయంగా కౌగిలించుకోవడం చూసి ఫ్యాన్స్ ఉబ్బితబ్బిబయ్యారు.