టాలీవుడ్ హీరోతో డేటింగ్లో సామజవరగమన హీరోయిన్
సామజవరగమన టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు కూడా భారీ విజయాన్ని అందుకుంటున్నాయి. ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమాలు మాత్రం దృవీకరించ పడుతున్నాయి. అలా అంచనాలు ఏమీ లేకుండా వచ్చిన సినిమా లలో సామజవర గమన సినిమా ఒకటి . ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు కథానాయకుడుగా నటించాడు. ఇక ఈ సినిమా లో రెబా మోనిక జాన్ హీరోయిన్ గా నటించి అందరిని మెప్పించింది.
రామ్ అబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా… మంచి విజయాన్ని కూడా అందుకుంది. ఈ సినిమాలో నరేష్, శ్రీకాంత్ అయ్యoగారు, వెన్నెల కిషోర్ మరియు రాజీవ్ కనకాల ప్రత్యేక పాత్రలలో కనిపించి అందరిని మెప్పించారు. ఈ సినిమాలో హీరో నరేష్ కామెడీ కూడా చాలా హైలెట్గా నిలిచింది. ఈ సినిమా ప్రస్తుతం ఆహా లో ప్రసారమవుతోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన రెబా మోనికా జాన్ సంచలనం వ్యాఖ్యలు చేసిందంట . ఇటీవల కాలంలో టాలీవుడ్ కు చెందిన యంగ్ హీరో తనను డేటింగ్ కి పిలిచాడని పేర్కొంది హీరోయిన్ రెబా మోనిక జాన్.
![టాలీవుడ్ హీరోతో డేటింగ్లో సామజవరగమన హీరోయిన్ ? 2 టాలీవుడ్ హీరోతో డేటింగ్లో సామజవరగమన హీరోయిన్ ?](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-2023-08-23T105017.396.jpg)
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీ రెబా మోనిక జాన్ ను యాంకర్ అడిగిన ప్రశ్నకు ఈ సమాధానం ఇచ్చింది. మిమ్మల్ని ఒక హీరో డేట్ కు పిలిచాడట కదా అంటూ యాంకర్ ప్రశ్నించింది. అయితే దీనికి చాలా సింపుల్గా హీరోయిన్ రెబా మోనిక జాన్ ఆన్సర్ ఇచ్చిందంట . అవును ఒక స్టార్ హీరో నన్ను డేట్ కు పిలిచాడు… అందులో ఏం తప్పు ఉంది ? ఈ కాలంలో అవి నాకు కామన్ అంటూ సమాధానం వచ్చింది రెబా మోనిక జాన్. నేను ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదు … నా కెరీర్ పైన దృష్టి పెడతాను అని వెల్లడించింది. కాగా హీరోయిన్ రెబా మోనిక జాన్.. అంతకు ముందు హీరో విజయ్ చేసిన బిగిల్ సినిమాలో నటించి అందరిని నడిపించి అందరిని మెప్పించిన సంగతి తెలిసిందే.