టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఒకటి . ఆమె సినిమాలకు కొంతకాలం గ్యాప్ ఇచ్చిందనే విషయం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిన విషయం అందరికి తెలిసిందే. ఇటీవలే బాలి వెకేషన్‌కు వెళ్లి వచ్చింది సామ్. ఇక అక్కడి నుంచి తిరిగి రాగానే చెన్నైలోని తన ఫ్రెండ్స్ చిన్మయి-రాహుల్ ఇంటికి వెళ్లింది. వారి పిల్లలతో కలిసి జాలీగా గడిపింది. ఆ చిన్నారులతో ‘ఆర్ఆర్ఆర్’లోని నాటు నాటుకు డ్యాన్స్ వేయించింది.
![చిన్మయి-రాహుల్ పిల్లలతో సమంత సందడి 2 చిన్మయి-రాహుల్ పిల్లలతో సమంత సందడి](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-2023-08-07T132946.684.jpg)
అలాగే పిల్లలతో పోటీ పడుతూ ఆడింది. దీనికి సంబంధించిన వీడియోను సమంత తన ఇన్‌స్టా స్టోరీలో పెట్టగా అది బాగా వైరల్‌గా మారింది. ఈ వీడియోను రాహుల్ రవీంద్రన్ తీసినట్లు అర్థమవుతుంది. పిల్లలతో కలిసి చిన్న పిల్లలా మారిపోయిన సామ్ వీడియో ప్రస్తుతం నెట్టింట ఇప్పుడు వైరల్ గా మారింది . .
ఇక సామ్.. విజయ్ దేవరకొండ తో నటించిన ‘ఖుషి’ సినిమా సెప్టెంబరు 1న ప్రేక్షకుల ముందుకు విడుదలు కాబోతుంది . బాలీవుడ్ నటుడు వరుణ్‌ధావన్‌తో కలిసి చేసిన ‘సిటాడెల్’ వెబ్‌సిరీస్ త్వరలోనే విడుదల కానుంది.