- Samantha Ruth Prabhu : మెరుపై సాగరా ఆ విజయం నీది రా అనే ఓ రచయిత రాసిన పాటను తన నిజ జీవితంలో ఫాలో అవుతోంది సమంత. మైయోసిటిస్ అనే ఆటో ఇమ్యూన్ కండిషన్‌తో బాధపడుతున్న సమంత రూత్ ప్రభు ఏ మాత్రం రెస్ట్ తీసుకోకుండా వర్క్ అవుట్స్ చేస్తూ తనని తాను ఫిట్ గా ఉంచుకుంంటూ కెరీర్ లో మెరుపులా దూసుకెల్తోంది. రీసెంట్ గా జిమ్ లో తన వర్కౌట్ వీడియో ను షేర్ చేసి ఇన్స్పిరేషన్ అందించిన సామ్ తాజాగా మరో వీడియోను పంచుకొని మెస్మరైజ్ చేస్తుంది.

సమంత తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియోలో ఆమె జిమ్‌లో ఆమె చేసే ఫిట్నెస్ వీడియో అందరినీ అబ్బుర పరుస్తుంది. ఈ వీడియో తో పాటు ఓ టెక్స్ట్ ని పోస్ట్ చేసింది సమంత. “ఇది సరదాగా కనిపించవచ్చు కానీ అది నిజం కాదు. మీరు ప్రయత్నిస్తారా?” అని తన ఫాలోవర్స్ ని ప్రశ్నించింది. నిజానికి సమంత చేసిన ఈ వర్కౌట్ అంతే ఈజీ కానే కాదు. బాడీ పైన పూర్తి పట్టు ఉండాలి. చేసే ఈ వర్క్ అవుట్ ఏమాత్రం స్లిప్ అయినా కష్టపడాల్సిందే. అయినా ఇలాంటి కఠోరమైన ఎక్సర్ సైజ్ చేసి తాను మళ్ళీ ఫిట్నెస్ తో ముందుకు వచ్చానని నిరూపిస్తుంది సమంత.

ఈ వీడియోతో సమంత ఇన్స్టాఫ్యామిలీని సూపర్‌గా ఆకట్టుకుంది. మై సామ్ ఇస్ బ్యాక్, కానీ మునుపటి కంటే మరింత బలంగా అని ఇన్స్టాగ్రామ్ లో ఓ వినియోగదారు కామెంట్ షేర్ చేసాడు. ఇది చేయడం కష్టం కానీ సామ్ ఇరగదీసింది అని మరో వినియోగదారు సామ్ ను పొగడ్తలతో ముంచేసాడు.

సమంతా రూత్ ప్రభు త్వరలో డోన్టన్ అబ్బే డైరెక్టర్ ఫిలిప్ జాన్‌తో అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్ అనే ప్రాజెక్ట్‌లో పని చేస్తుంది. సమంతా ది ఫ్యామిలీ మ్యాన్ 2తో పెద్ద డిజిటల్ రంగ ప్రవేశం చేసింది, దాని కోసం ఆమె రాజి పాత్రలో ఇరగదీసింది. భారతీయ వెర్షన్ సిటాడెల్లో కూడా నటి కనిపించనుంది.
