విజయ్ బ్యాడ్ హ్యాబిట్స్ పై.. సమంత కామెంట్స్
సమంత గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీలో పెద్ద హీరోయిన్ గా సమంత పాపులర్ అయిపోయారు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాలో నటిస్తోంది సమంత. మైత్రి సినిమా మేకర్స్ భారీ బడ్జెట్ తో ఖుషి మూవీ ని తెర మీదకి తీసుకువస్తున్నారు. మలయాళం సెన్సేషన్ హెశం అబ్దుల్ వహాబ్ ఈ మూవీ కి సంగీతాన్ని అందించారు, ప్రస్తుతం సమంత విజయ్ దేవరకొండ ఇద్దరు ప్రమోషన్లలో బాగా బిజీగా ఉన్నారు.
తాజాగా తమిళ ఇంటర్వ్యూలో వీళ్ళు పాల్గొన్నారు. విజయ్ ని చూసి చాలా మంది ఏదేదో అనుకుంటారు. కానీ అతనికి ఒక చెడు అలవాటు కూడా లేదని. అది తెలిసి నేను షాక్ అయ్యానని సమంత చెప్పకు వచ్చిందంట . విజయ్ అలవాట్లపై చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. సామ్ అన్నట్లుగా విజయ మాట తీరు ప్రవర్తన చూస్తే అతనికి చెడు అలవాట్లు ఉన్నాయని అంతా అనుకుంటారు కానీ అతనికి ఎటువంటి చెడు అలవాట్లు లేవు . సమంతనే స్వయంగా ఈ విషయాలని చెప్పుకొచ్చింది .