తెలుగుచిత్ర పరిశ్రమలో నటుడు వీకే నరేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకానొక సమయంలో హీరోగా కొన్ని పదుల సంఖ్యలో సినిమాలు చేసిన ఈయన ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా స్థిరపడిపోయారు. ఇదిలా ఉండగా నరేష్ సినిమాల కంటే తన వ్యక్తిగత జీవితంలోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా మూడు పెళ్లిళ్లు చేసుకోవడమే కాదు వారి ముగ్గురితో విడాకులను ప్రకటించి పవిత్ర లోకేష్ తో సహజీవనం అంటూ ఆయన చేసిన రచ్చ అంతా ఇంతా కాదని చెప్పాలి.
![మూడవ భార్య ఫై నరేష్ సంచలన వ్యాఖ్యలు.. వామ్మో ..? 2 మూడవ భార్య ఫై నరేష్ సంచలన వ్యాఖ్యలు.. వామ్మో ..?](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-2023-08-02T112534.213.jpg)
ఇకపోతే ఆయన మూడవ భార్య రమ్య రఘుపతి కి విడాకులు ఇచ్చి పవిత్ర ను పెళ్లి చేసుకుందాం అని ఆలోచిస్తున్న నరేష్ కి రమ్య రఘుపతి మాత్రం మంచి ఝలక్ ఇచ్చిందని చెప్పాలి. అసలు అతనికి విడాకులు ఆమె ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు. అసలు నరేష్ ఎందుకు ఆమెకు విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నాడు అనే విషయంపై ఆయనను అడిగితే ఆయనే తనను రకరకాలుగా హింసిస్తోందని చెబుతూ అందరికీ షాక్ ఇచ్చారు. ఇక ఇదే ఉద్దేశంతో తన భార్యని టార్గెట్ చేసి మళ్లీ పెళ్లి అనే సినిమా కూడా తీయగా ఆ… సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద భారీవిజయాన్ని సాధించింది.