Liger movie : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా ‘లైగర్’. ఈ సినిమాతో దక్షిణాదికి తొలిసారిగా అనన్యాపాండే హీరోయిన్గా పరిచయం కాబోతోంది. ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఆగస్టు 25న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమా నుంచి వచ్చిన అన్ని అప్డేట్స్తో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమా ట్రైలర్‌తో మంచి బజ్‌ను క్రియేట్ చేసుకుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ లో స్పీడ్ పెంచింది చిత్ర యూనిట్. దేశమంతా పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు.
ఇక అది అలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ పనులు కూడా పూర్తయ్యాయి. ఈ సినిమాకి సెన్సార్ సభ్యులు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేస్తూ.. చిత్ర యూనిట్‌కి భారీ షాక్ ఇచ్చారు. ఈ సినిమాలో కొన్ని అసభ్యకరమైన సీన్స్ ఉన్నాయని, వాటిని మార్చాలని బోర్డు సభ్యులు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ చెప్పే బోల్డ్ డైలాగ్స్‌కి సెన్సార్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే చేతులతో సంజ్ఞ చేసే సీన్‌ని పూర్తిగా తొలగించమని సెన్సార్ బోర్డ్ చిత్ర యూనిట్‌కు సూచించింది. మొత్తంగా ఏడు సన్నివేశాలను మార్పులు చేయాల్సిందిగా బోర్డ్ ఆదేశాలు జారీ చేసింది.
Liger movie : ఆ ఏడు సీన్ల తొలగింపు ప్రభావం సినిమాపై ఎలా ఉంటుందో..
సెన్సార్ బోర్డు ఆదేశాల మేరకు ఆయా సీన్స్‌ను తొలగించి లైగర్ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు దర్శకనిర్మాతలు రెడీ అవుతున్నారు. విజయ్ దేవరకొండ సినిమాల్లో సాధారణంగా బోల్డ్ సీన్స్, డైలాగ్స్ ఉంటాయి. ఒకరకంగా ‘అర్జున్‌రెడ్డి’ సినిమా నుంచే ఈ ట్రెండ్ మొదలైంది. ఇక విజయ్‌కు పూరీ లాంటి ఊరమాస్ డైరక్టర్ తోడైతే ఎలాంటి బోల్డ్ సీన్స్ ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరి ఆ ఏడు సీన్ల తొలగింపు ప్రభావం సినిమాపై ఎలా ఉంటుందో చూడాలి. పూరి కనెక్ట్స్ , బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.