Sexual Life: శృంగారం ప్రతి జీవికీ దేవుడిచ్చిన వరం. ఇందులో చెందే అనుభూతి ఎంతో మధురమైనది. శృంగారం చేయడం వల్ల కేవలం మానసికోల్లాసమే గాక శారీరకంగా ఉత్సాహంగా ఉంటారు. సెక్సువల్ లైఫ్ బాగున్న జంటలు జీవితంలో పరిపూర్ణంగా జీవిస్తున్నట్లు అర్థం చేసుకోవచ్చు. అయితే, శృంగారం చేయడానికి కూడా ఓ లిమిట్ ఉంటుంది. అవకాశం లభించినప్పడు అతిగా చేయడం వల్ల అనర్థాలూ ఉంటాయి. అసలే లేకపోవడం వల్ల కూడా జీవితంలో కొన్ని మధు క్షణాలు మిస్ అవుతారు. దీనిపై నిపుణులు చెప్పే మాట ఏంటంటే.. వయసును బట్టి, శరీరాల శక్తిని బట్టి శృంగార సమయం ఉండాలంటున్నారు.
అనేక అధ్యయనాల్లోనూ ఏ వయసు వారు ఎంత సేపు శృంగారం చేయాలనే అంశాలు వెల్లడయ్యాయి. ఇటీవల కిన్సేస్ టిట్యూట్ ఆఫ్ సెక్స్, రీ ప్రొడక్షన్ అండ్ జెండర్ సంస్థకు చెందిన నిపుణులు వయసు ప్రకారం ఏ జంటలు ఎన్ని సార్లు సంభోగించాలో వెల్లడించారు. మన ఆరోగ్యంపై శృంగారం ఎంతటి ప్రభావం చూపుతుందో అధ్యయనంలో వెల్లడించారు.
2000 సంవత్సరం తర్వాత పుట్టిన వారు యుక్త వయసుకు చేరుకున్నప్పుడు ఎక్కువ సమయం శృంగారం చేయడానికి మొగ్గుచూపుతున్నారట. 18 నుంచి 29 ఏళ్ల వయసున్న వారు వారానికి రెండు సార్లు సెక్స్ లో పాల్గొనాలని అధ్యయనంలో తేల్చారు. 30 నుంచి 39 ఏళ్ల వయసు వారు ఏడాదికి కనీసం 86 సార్లు సెక్స్ లో పాల్గొనాలట. 40 నుంచి 49 సంవత్సరాల వయసు వారు సంవత్సరానికి 69 సార్లు సెక్స్ చేయాలట.
Sexual Life:
వయసు పెరిగే కొద్దీ అనేక జంటలు శృంగారంలో పాల్గొనేందుకు ఆసక్తి తగ్గిస్తారు. సెక్స్ లో పాల్గొనే వారు ఎంతో ఆరోగ్యకరంగా ఉంటారని అధ్యయనంలో తేలింది. వారానికి కనీసం రెండు సార్లయినా శృంగారంలో పాల్గొనడం వల్ల అధిక రక్తపోటు నుంచి ఉపశమనం పొందుతారట. ఒత్తిడిని దూరం చేసుకోవడానికి సెక్స్ లైఫ్ బాగా ఉపయోగపడుతుంది. వయసు పైబడటం, కుటుంబంలో బరువు బాధ్యతలు, పిల్లలు.. ఇలా రకరకాల కారణాలతో అనేక జంటలు శృంగారం విషయంలో అనాసక్తి చూపుతున్నారని అధ్యయనంలో వెల్లడైంది.