Shaakuntalam: సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ సమంత లీడ్ రోల్ లో మహాభారతంలోనే ఆదిపర్వంలో కథ ఆధారంగా శాకుంతలం మూవీ తెరకెక్కిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో విజువల్ ఎఫెక్ట్స్ తో ప్రేమకావ్యంగా ఈ మూవీ తెరకెక్కింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఈ మూవీ ఉంది. ఈ నెలలోనే ఈ మూవీ నిజానికి రిలీజ్ కావాల్సి ఉంది. అయితే ఫిబ్రవరి 19 అనుకున్న రిలీజ్ డేట్ ని ఏప్రిల్ 14కి మార్చారు. అంటే రెండు నెలలకి పైగా సినిమాని వాయిదా వేశారు. ఇక ఈ సినిమా వాయిదా పడటం ఇది మూడో సారి కావడం విశేషం. దిల్ రాజు కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అయ్యారు. ఇదిలా ఉంటే మహాభారతం ఆధారంగా తెరకెక్కిన చిత్రం కావడంతో దీనిపైన భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి.

ఇక మైథలాజికల్ జోనర్ లో వస్తున్న మూవీ కావడంతో కచ్చితంగా పాన్ ఇండియా లెవల్ లో మహాభారతం ఇష్టపడే ప్రతి ఒక్కరికి శాకుంతలం మూవీ నచ్చుతుందని భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా ప్రకటించిన రిలీజ్ డేట్ ఇప్పుడు సినిమాకి పెద్ద ఇబ్బందిగా మారే అవకాశాలు ఉన్నాయనే మాట టాలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తుంది. దీనికి కారణం అదే రోజు స్టార్ హీరోల చిత్రాలు రిలీజ్ కాబోతూ ఉండటమే దీనికి కారణం. ఏప్రిల్ 14న మెగాస్టార్ భోళా శంకర్ సినిమా రిలీజ్ కూడా ఎనౌన్స్ చేశారు.
అలాగే రజినీకాంత్ జైలర్ మూవీ కూడా అదే రోజు పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అవుతుంది. లారెన్స్ పాన్ ఇండియా మూవీ రుద్రుడు కూడా అదే రోజున రిలీజ్ చేయడానికి డేట్ అనౌన్స్ చేశారు. నిజానికి ఈ మూడు భారీ చిత్రాలే కావడం విశేషం. అయితే మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ రిలీజ్ లేట్ అయ్యే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది. అలాగే జైలర్ కూడా వాయిదా పడొచ్చని అంటున్నారు. కాని రుద్రుడు మూవీ మాత్రం రిలీజ్ పక్కా అనే మాట వినిపిస్తుంది. మరి శాకుంతలం, రుద్రుడు మధ్య పోటీ ఉంటే ఏ సినిమా నిలబడుతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.