Shahrukh Khan : రిలీజ్‌కు ముందు అనేక వివాదాలను ఎదుర్కొన్న పఠాన్ మూవీ బాక్సాఫీస్‌ను బద్దలు కొడుతోంది. అంచనాలను మించి కలెక్షన్స్‌ను రాబడుతూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. శుక్రవారం షారుఖ్ ఖాన్ నటించిన పఠాన్ హిందీ వెర్షన్ భారతదేశంలో రూ.37.5 కోట్ల నికర వసూళ్లను రాబట్టింది. అయితే రిపబ్లిక్ డే కారణంగా జాతీయ సెలవుదినం అయిన మునుపటి రోజుతో పోలిస్తే 45 శాతం తగ్గింది. అయినప్పటికీ, పఠాన్ మొదటి మూడు రోజుల తర్వాత మొత్తం దేశీయ సేకరణ రూ.160-161 కోట్ల రూపాయలను నికరంగా వసూళ్లను అందుకుంటోంది.

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ చిత్రంలో దీపికా పదుకొణె, జాన్ అబ్రహం, డింపుల్ కపాడియా ,అశుతోష్ రాణా కీలక పాత్రలు పోషించారు. జనవరి 25న థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. పఠాన్ దేశీయ బాక్సాఫీస్ కలెక్షన్లు శనిచ ఆదివారాల్లో వరుసగా రూ.40 కోట్లు రూ.50 కోట్లకు పెరగవచ్చు అని నిపుణులు అంచనా వేస్తున్నారు.

దేశీయంగానే కాదు, షారుఖ్ నటించిన పఠాన్ అంతర్జాతీయ బాక్సాఫీస్ లోనూ రికార్డులను కొల్లగొడుతోంది. మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా రూ.106 కోట్లు వసూలు చేసింది. కొత్త నివేదికల ప్రకారం, పఠాన్ ఒకే భాషలో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు చేసిన భారతీయ చిత్రంగా అవతరిస్తోంది. ప్రొడక్షన్ బ్యానర్ యష్ రాజ్ ఫిల్మ్స్ ప్రకారం, పఠాన్ విడుదలైన రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లు వసూలు చేసింది.

దంగల్ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.702 కోట్లతో అతిపెద్దమొత్తంలో వసూళ్లను రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఆ తరువాత బాహుబలి 2: ది కన్‌క్లూజన్ కంటే సింగిల్ లాంగ్వేజ్ తీసుకుంటే, ఓవర్సీస్ నంబర్‌ల ప్రకారం రూ.800 కోట్లు వసూలు చేసింది. భారతదేశంలో రూ.400 కోట్ల వసూళ్లను సాధించిన సినిమాగా నిలిచింది. పఠాన్ జోరును చూస్తుంటే బాహుబలి 2: ది కన్‌క్లూజన్ సంఖ్యను అధిగమిస్తుంది అని కొత్త బాక్స్ ఆఫీస్ ఇండియా తన నివేదికలో పేర్కొంది.