బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది.ఓ సినిమా షూటింగ్ కోసం లాస్ ఏంజెల్స్ వెళ్ళిన షారుక్ ఖాన్ కి షూటింగ్ జరుగుతుండగా సెట్స్ లోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ముక్కుకి బలమైన గాయం తగలడంతో వెంటనే ఆయనని ఆసుపత్రికి తరలించి.
అనంతరం చికిత్స అందించినట్టు సమాచారం. ముక్కుకి బలమైన గాయం తగలడంతో సర్జరీ చేయాల్సి వచ్చిందట దీంతో అమెరికాలోని వైద్యులు ఆయనకి సర్జరీ చేశారని తెలుస్తోంది. ఆయన ముక్కుకి బ్యాండేజ్ తో కనిపించడం వల్లే ఈ విషయం బయటకు వచ్చిందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
ప్రస్తుతం షారుఖ్ ఖాన్ ముంబైలో తన నివాసంలోనే ఉన్నట్టు విశ్రాంతి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై షారుఖ్ ఖాన్ గాని ఆయన టీం గానీ ఇప్పటివరకు ఎలాంటి సమాచారాన్ని అభిమానులతో పంచుకోలేదు.ఏదేమైనా అయన తొందరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.