హీరో , హీరోయిన్ లు ఎవరైనా సరే కంటెంట్ బాగుంటే వారికే ప్రేక్షకులు ఎక్కువ మంది ఓటు వేస్తారు అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయాలను మరి పెద్ద హీరోలు దృష్టిలో పెట్టుకోవడం లేదో ఏమో తెలియదు కానీ వారి నిర్లక్ష్యమే చిన్న సినిమాల ముందు వారి గౌరవాన్ని కించపరిచేలా చేస్తోందని చెప్పుకోవచ్చు . ఇక సరిగ్గా ఇప్పుడు ఇండస్ట్రీలో అలాంటిదే జరిగింది. ఒక సినిమా ప్రేక్షకులను మెప్పించింది అంటే.. అది రోజులతో సంబంధం లేకుండా కలెక్షన్లను వసూలు చేస్తూనే ఉంటుంది. అంతేకాదు పెద్ద సినిమా వచ్చినా సరే ఆ సినిమా తో పాటే ఈ సినిమాను కూడా థియేటర్లలో విడుదలు చేస్తారు . అయితే ఇక్కడ మాత్రం ఏకంగా రెబల్ స్టార్ ప్రభాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వంటి హీరోలు పూర్తిగా అవమానపడ్డారు అనే వార్తలు ఎక్కువ గా వినిపిస్తున్నాయి .
![చిన్న సినిమా ముందు స్టార్ హీరోలకు అవమానం.. ఏమైందంటే..? 2 చిన్న సినిమా ముందు స్టార్ హీరోలకు అవమానం.. ఏమైందంటే..?](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-2023-08-03T130604.391.jpg)
అసలు విషయంలోకెళితే తాజాగా విడుదలైన బేబీ అనే చిత్రం అందుకు ఉదాహరణ అని చెప్పుకోవచ్చు . ఆనంద్ దేవరకొండ హీరోగా, యూట్యూబర్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా తాజాగా విడుదలైన చిత్రం బేబీ.. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో సంచలనం సృష్టించింది. రూ.80 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసి సంచలనం సృష్టిస్తోంది ఈ సినిమా. ఇకపోతే ఒక్క కలెక్షన్ల పరంగానే కాదు తాజాగా పవన్ కళ్యాణ్ నటించిన బ్రో, ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమాలను కూడా అదే విదంగా డామినేట్ చేసింది అంటే సాధారణమైన విషయం కాదు
ఈ రెండు సినిమాల కంటే కూడా కొన్ని సెంటర్స్ లలో అదే రోజు బేబీ సినిమాకి ఎక్కువ వసూలు రావడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఆరవ రోజు కూడా బేబీ రెండు కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూలు చేయగా.. ఆది పురుష్ , బ్రో సినిమాలు కేవలం కోటి రూపాయలు మాత్రమే వసూలు సాధించాయి. ఇక దీంతో చిన్న సినిమా ముందు పెద్ద హీరోల సినిమాలు నిలబడలేదనే కామెంట్లు ఎక్కువ గా వినిపిస్తున్నాయి