Shiva Karthikeyan: కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తీకేయన్ టాలీవుడ్ డైరెక్టర్ అనుదీప్‌తో తీసిన ద్విభాషా చిత్రం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. దీంతో ఉదయం నుంచే థియేటర్ల ముందు ఈయన అభిమానుల హంగామా మొదలైంది. అయితే శిశ కార్తీకేయన్ సైతం థియేటర్లలో సినిమా చూస్తూ హల్చల్ చేశారు. ఈరోజు ఉదయం చెన్నైలోని రోహిణి సిల్వర్ స్క్రీన్స్ థియేటర్‌కు వెళ్లి అక్కడ అభిమానులతో కలిసి ప్రిన్స్ మూవీని తిలకించాడు. ఈ సందర్భంగా ఆయన డ్యాన్స్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
వైరల్ అయిన శివకార్తికేయన్ డ్యాన్స్
ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విడుదలైన బింబిలిక్కి అనే పాటను గతంలోనే విడుదల చేశారు. థమన్ సంగీతం అందించిన ఈ పాట శ్రోతలను ఆకర్షించింది. దీంతో ఈ సాంగ్ సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. అయితే థియేటర్లలో ఈ పాటకు శిశకార్తీకేయన్ థియేటర్లో డ్యాన్స్ చేసి ఫ్యాన్స్‌ను ఉత్సాహపరిచాడు. దీంతో అభిమానులు కూడా ఆయన పాటు కాలు కదిపి స్టెప్పులేశారు. దీంతో థియేటర్ మొత్తం హోరెత్తింది.
ప్రిన్స్ మూవీ శివకార్తికేయన్ తెలుగులో డైరెక్ట్‌గా నిటిస్తున్న తొలి సినిమా కావడం విశేషం. ఉదయం నుండి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో మూవీ మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో శివకార్తికేయన్‌కు జోడీగా ఉక్రెయిన్ బ్యూటీ మరియా ర్యాబోషష్క నటించారు. ఆమె నటన, అందచందాలు కూడా ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయని అంటున్నారు.
Shiva Karthikeyan:
ఈ సినిమాకు జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ దర్శకత్వం వహించగా థమన్ అదిరిపోయే సంగీతం అందించాడు. పూర్తిగా కామెడీ జోనర్లో తెరకెక్కించిన ఈ సినిమాను శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎఎల్పీ సురేష్ ప్రొడక్షన్స్, శాంతి టాకీస్లు సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాలో నటుడు సత్యరాజ్ కీలక పాత్రలో నటించారు.