Bigboss Reality Show : ప్రముఖ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ క్రేజ్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షోకు సంబంధించి ఎలాంటి న్యూస్ వచ్చినా శరవేగంగా వైరల్ అవుతుంటుంది.భాషలతో సంబంధం లేకుండా ఈ షోకు విపరీతమైన ఆదరణ ఉంటుంది. ఈ షోలో చేసిన నటీనటుల పరిస్థితి తరువాత ఎలా ఉన్నా కూడా.. పార్టిసిపేట్ చేయడమే ఒక అదృష్టంగా భావిస్తుంటారు. సెలబ్రిటీలు కొందరిని ఒకే ఇంటిలో బంధిస్తారు. వారికి బయటి వారితో ఎలాంటి సంబంధం ఉండదు. కనీసం ఫోన్ సౌకర్యం కూడా ఉండదు. వారి మధ్య జరిగే గొడవలు, ఇక ఎలిమినేషన్ సమయంలో జరిగే రచ్చ, టాస్కులు జనానికి ఎక్కడలేని వినోదాన్ని పంచుతాయి. అందుకే ఈ షోకి అంత క్రేజ్.
Bigboss Reality Show : ప్రతి న్యూస్ వైరలే…
తెలుగులో ఈ షో బిగ్‌బాస్ 5 సీజన్లు పూర్తి చేసుకుంటే.. హిందీలో ఏకంగా 15 సీజన్లు జరుపుకుంది. ఇప్పుడు 16వ సీజన్‌కు రెడీ అవుతోంది. ఇక ఈ షో ప్రారంభమవుతుందంటే ఎంత రచ్చ ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదుగా. ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ ఫలానా వాళ్లంటూ లిస్ట్‌ల మీద లిస్ట్‌లతో వెబ్‌సైట్స్ అన్నీ రెడీ అయిపోతాయి. ప్రతి న్యూస్ వైరలే. తాజాగా హిందీ బిగ్బాగ్ గురించి ఒక షాకింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. హిందీ బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా సల్మాన్ ఖాన్ ఉన్నాడు. ఒకరకంగా ఈ షోకు ఆయనే హైలైట్. స్టైల్, మ్యానరీజం, వాక్చాతుర్యం.. తనకున్న క్రేజ్‌తో సల్మాన్ బిగ్‌బాస్ షోను సక్సెస్ ఫుల్‌గా నడిపిస్తున్నాడు.
ప్రతి సీజన్‌కు సల్మాన్ రెమ్యూనరేషన్ హాట్ టాపిక్‌గా మారుతుంటుంది. ఆయనను వదులుకోవడంతో షోకున్న డిమాండ్‌ను దాదాపు కోల్పోడమే. అందుకే ఆయన అడిగినంత రెమ్యూనరేషన్ ఇచ్చేందుకు నిర్వహకులు సైతం నో చెప్పడం లేదు. గత సీజన్ ఒక్కో ఎపిసోడ్‌కు రూ.15 కోట్ల చొప్పున అందుకున్న భాయిజాన్ 16వ సీజన్‌కు షాకింగ్ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడని టాక్. సల్మాన్ డిమాండ్ చేస్తున్న రెమ్యూనరేషన్ గురించి విన్నాక షో నిర్వాహకులే అవాక్కయ్యారని సమాచారం. ఇంతకీ ఆయన అడిగిన రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? సీజన్ మొత్తానికి ప్యాకేజీ కింద సుమారుగా 1000 కోట్ల రూపాయలకు పైమాటే. ఈ న్యూస్‌లో నిజానిజాలెంతో.. ఒకవేళ ఇది నిజమైతే.. దీనిపై షో నిర్వాహకులు ఏం చేస్తారో వేచి చూడాలి.