Bigg boss 6 : బిగ్‌బాస్ సీజన్ 6 తెలుగు ఏడవ వారం వీకెండ్‌కు వచ్చేసింది. ఇవాళ్టి ఎపిసోడ్‌తో పాటు రేపటి ఎపిసోడ్‌కి సంబంధించిన షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తైనట్టు తెలుస్తోంది.ఇక దీపావళి సంబరాలు రేపు జరగనున్నాయి. అలాగే ఎలిమినేషన్ కూడా జరగనుంది. ఇక ఈ వారానికి సంబంధించి హోస్ట్ నాగార్జున అడగాల్సిన వారిని అడిగేసి ప్రశంసలు కురిపించాల్సిన వారిపై కురిపిస్తారు. ఇదంతా పక్కన పెడితే ఈ వారం ఏమాత్రం ఊహించని వ్యక్తి ఎలిమినేట్ అయ్యాడు. అస్సలు కనీసం డేంజర్ జోన్లోకి కూడా అర్జున్ రాలేదు. కానీ ఎలిమినేట్ అయిపోయాడు. దీనికి కారణాలు లేకపోలేదు.
అర్జున్ నిజానికి గేమ్ కనిపించడం లేదు.పైగా అతను ఆర్గ్యుమెంట్‌లో సైతం చాలా వీక్ ఉంటాడు.చాలా కన్ఫ్యూజన్లో ఉంటాడు. కనీసం సత్యతో పులిహోర కలపడానికి తప్ప అతను మరే కారణంగానూ హౌస్‌లో ఉంటున్నట్టు కనిపించడు. మరి అలాంటప్పుడు ప్రేక్షకులు అతనికి ఎందుకు ఓటేస్తారు? కానీ ఓటింగ్ మాత్రం కొందరు కంటెస్టెంట్స్‌తో పోలిస్తే గట్టిగానే పడుతోంది. దీనికి కారణం పీఆర్ టీమ్ అర్జున్ కోసం బీభత్సంగా పని చేస్తోంది. అందరికీ పీఆర్ టీమ్ ఉంటుంది. కానీ అర్జున్ టీం మాత్రం స్ట్రాంగ్. ప్రస్తుతం కూడా అర్జున్ ఓటింగ్‌లో 5వ స్థానంలో ఉన్నాడు. కానీ ఎందుకు అర్జున్ నామినేట్ అయ్యాడు?
అంటే లీస్ట్‌లో ఉన్న కంటెస్టెంట్స్ వాసంతి, ఇనయ, రోహిత్ ఉన్నారు. వాసంతిని అర్జున్‌తో కంపేర్ చేస్తే.. ఆమె ఆర్గ్యుమెంట్ విషయంలో పర్ఫెక్ట్. చక్కగా తనను తాను డిఫెండ్ చేసుకోగలదు. ఆమె ఆర్గ్యుమెంట్‌ను ప్రేక్షకులు సైతం కాస్త ఇష్టపడుతున్నారు. కాబట్టి అర్జున్ కంటే వాసంతి బెటర్. ఇక ఇనయ.. ఆమె ప్రస్తుతం గేమ్ ఆడకపోయినా కూడా అర్జున్ కంటే ఆమె ఉంటేనే కాస్త కంటెంట్ వచ్చే అవకాశం ఉంది.ఇక రోహిత్ తను అనుకున్న విషయాన్ని కచ్చితంగా చెప్పేయగలడు పైగా గత వారం అతనికి బాగా కలిసొచ్చింది. ఏ రకంగా చూసుకున్నా కూడా అర్జున్ ఉండటం వల్ల బిగ్‌బాస్‌కు పెద్దగా ఒరిగేదేం లేదు. అందుకే అతడిని ఎలిమినేట్ చేసినట్టు టాక్.