Sobhita Dhulipala : నటి శోభితా ధూళిపాళ ప్రస్తుతం ఆమె రాబోయే వెబ్ సిరీస్ ది నైట్ మేనేజర్ విడుదల కోసం ఎదురుచూస్తోంది. ఫిబ్రవరీ 17న ఈ సీరీస్‌ను ఓటీటీ ప్లాట్‌ఫారమ్ డిస్నీ+హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. నైట్ మేనేజర్లో అనిల్ కపూర్ , ఆదిత్య రాయ్ కపూర్ కూడా కీలక పాత్రలు పోషించార . ప్రస్తుతం శోభిత ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. నటి తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తన ప్రచార డైరీల నుండి చిత్రాలను పంచుకుని ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. ఆమె అదిరిపోయే లుక్స్‌తో ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరుస్తోంది ఈ బ్యూటీ.

శోభిత ఫ్యాషన్ డిజైనర్ హౌస్ మూన్రేకు మ్యూజ్ గా వ్యవహరించింది. తన లేటెస్ట్ ఫోటో షూట్ కోసం పింక్ కో-ఆర్డ్ సెట్‌ను ఎంచుకుంది. శోభిత స్లిప్ పింక్ సిల్క్ టాప్ ధరించి దానికి జోడీగా పెద్ద ప్లీట్లను కలిగి ఉన్న పింక్ లాంగ్ స్కర్ట్ ను వేసుకుంది. పైభాగంలో స్లిప్ స్లీవ్ల నుండి వేలాడుతున్న నెక్లైన్ వెండి గొలుసు వివరాలతో ఉన్న ఈ అవుట్పిట్ లో శోభితా చాలా అందంగా కనిపించింది.

శోభిత తన రూపాన్ని మరింత అట్రాక్టివ్ గా మార్చుకునేందుకు ఈ అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగా చెవులక గోల్డెన్ హూప్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంది. పాదాలకు సిల్వర్ హీల్స్ వేసుకుంది. ఉంగరాల కర్ల్స్లో స్టైల్ చేసిన తన కురులను లూజ్‌గా వదులుకుంది. మేకప్ ఆర్టిస్ట్ సోనిక్ సర్వాతే సహాయంతో, శోభిత అద్భుతంగా మేకోవర్ అయ్యింది. కనులకు న్యూడ్ ఐషాడో, బ్లాక్ ఐలైనర్, కనురెప్పలకు మస్కరా వేసుకుంది. పెదాలకు న్యూడ్ లిప్‌స్టిక్ దిద్దుకుని మరింత గ్లామర్ తో కవ్వించింది.

శోభిత ఫ్యాషన్ డైరీలు రోజురోజుకూ మెరుగవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం, నటి ఫ్యాషన్ డిజైనర్ హౌస్ సమ్మర్ సమ్వేర్కి మ్యూజ్ గా వ్యవహరించింది. తన ఫోటో షూట్ కోసం డిజైనర్ హౌస్ షెల్ఫ్‌ల నుండి సొగసైన శాటిన్ గౌనుని ఎంచుకుంది. నెక్లైన్ వద్ద ఐవరీ వైట్ ప్యాటర్న్లతో ప్రకాశవంతమైన నారింజ రంగు స్లిప్ గౌనులో శోభిత అద్భుతంగా కనిపించింది. గౌను ముందు నెక్లైన్ , వెనుక భాగంలో ముడి వివరాలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి.

శోభిత ఈ అవుట్‌ఫిట్‌ను ధరించి ఇన్డోర్ ఫోటో షూట్ చేసింది. సూర్యుడిని ముద్దు పెట్టుకుంటున్నట్లు చిత్రాలకు పోజులిచ్చింది ఈ చిన్నది. ఈ అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగా చెవులకు హూప్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంది. పాదాలకు న్యూడ్ హీల్స్ వేసుకుని అట్రాక్టివ్ గా కనిపించింది చిన్నది. శోభిత తన లుక్కు సెట్ అయ్యే విధంగా న్యూడ్ ఐషాడో, బ్లాక్ ఐలైనర్,కనురెప్పలకు మస్కరా వేసుకుని ఐబ్రోస్ ను డార్క్ చేసింది. పెదాలకు న్యూడ్ లిప్ స్టిక్ పెట్టుకుని అందరి చూపును తనవైపుకు తిప్పుకుంది.
