మన టాలీవుడ్ ప్రామిసింగ్ హీరో నిఖిల్ హీరోగా ఐశ్వర్య మీనన్ హీరోయిన్ గా దర్శకుడు గ్యారీ బి హెచ్ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం “స్పై”. మరి యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ చిత్రం నిఖిల్ కెరీర్ లోనే అధిక ఓపెనింగ్స్ డే 1 కి రాబట్టగా యూఎస్ లో కూడా ఇదే రేంజ్ పెర్ఫామెన్స్ ని అయితే కనబరుస్తుంది.
![“స్పై” లేటెస్ట్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్.! 2 “స్పై” లేటెస్ట్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/11.jpg)
ఇక వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం మొత్తం మూడు రోజుల రన్ ని కంప్లీట్ చేసుకోగా ఈ మూడు రోజుల్లో అయితే ఈ చిత్రం 21.6 కోట్ల గ్రాస్ ని అయితే రాబట్టి స్టాండర్డ్ వసూళ్ళని రాబట్టింది. ఇక ఈ ఆదివారం కూడా మంచి వసూళ్లే రిజిస్టర్ అవుతున్నట్టు తెలుస్తుంది. మరి ఇవెలా ఉంటాయో చూడాలి. ఇక ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్, శ్రీచరణ్ పాకల సంగీతం అందించగా రానా జిష్షు సేన్ గుప్త తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అలాగే ఈ చిత్రాన్ని ఈడీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించారు.