SreeLeela: టాలీవుడ్ లో పెళ్లి సందడి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన అందాల భామ శ్రీలీల వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ధమాకాలాంటి బ్లాక్ బస్టర్ హీట్ తర్వాత ఈ బ్యూటీ స్పీడ్ మరింత పెరిగింది అని చెప్పాలి. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్ సూపర్ స్టార్ మహేష్ బాబు జోడిగా తెరకెక్కుతున్న సినిమాలో ఒక హీరోయిన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈమె చేతికి మరో క్రేజీ ఆఫర్ వచ్చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో ఈమెను ఖరారు చేసినట్లు తెలుస్తుంది. మొదట ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హెగ్డేను అనుకున్నారు.
అయితే ప్రస్తుతం ఆమె ప్లేస్ లో శ్రీలీలను ఫైనల్ చేసినట్లుగా టాలీవుడ్లో వినిపిస్తున్న మాట. ఏప్రిల్ మొదటి వారంలో ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి ప్లాన్ జరుగుతుంది. ఇక షూటింగ్ ప్రారంభమయ్యే సమయంలోనే శ్రీలీలను హీరోయిన్ అఫీషియల్ అనౌన్స్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. కెరియర్ ఆరంభంలోనే ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ జోడీగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయడం నిజంగా విశేషం అని చెప్పాలి. ఇప్పుడు ఆ అదృష్టం శ్రీలీలకు వచ్చింది.
ఇదిలా ఉంటే మరో క్రేజీ ఆఫర్ కూడా ఈ బ్యూటీ సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ లో విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కబోయే పాన్ ఇండియా సినిమాలో కూడా శ్రీ లీలను హీరోయిన్ గా ఖరారు చేసినట్లు తెలుస్తుంది. త్వరలో అధికారికంగా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసే అవకాశం ఉందని సమాచారం. ఇలా వరుస స్టార్ హీరోలతో అవకాశాలు సొంతం చేసుకుంటూ ఉన్న శ్రీ లీల ప్రస్తుతం టాలీవుడ్ లో మోస్ట్ క్రెజియస్ట్ హీరోయిన్ గా గుర్తింపు సొంతం చేసుకుందని చెప్పాలి.