సినీ పరిశ్రమలో అడుగుపెట్టి కొద్దీ కాలమే అయినా నటించిన రెండే సినిమాలు అయినా , కానీ ఈ ముద్దుగుమ్మ కి 10 కి పైగా సినిమాలు చేతిలో పెట్టుకుని ఫుల్ లైఫ్ బిజీగా అయ్యిన కథానాయిక ఎవరా ఆలోచిస్తున్నారా?? ఆమె మరెవరో కాదండి మన శ్రీ లీల .ఇప్పుడు టాలీవుడ్లోనే మోస్ట్ బిజీ హీరోయిన్ ఆమె .క్షణం ఖాళీ లేకుండా అన్ని సినిమాలు అలా ఎలా చేస్తుందో ఎవరికి అర్థం కావడం లేదు . ఇటు యాడ్స్ కి సైతం చేసుకుంటూ , ఆమె పేరు ఎప్పుడూ సోషల్ మీడియాలో కూడా ఫుల్ హాట్ టాపిక్ గా మారింది.
![స్టార్ హీరోలకు నో చెప్పిన శ్రీ లీల 2 స్టార్ హీరోలకు నో చెప్పిన శ్రీ లీల](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/Untitled-design-29.jpg)
శ్రీలీల సోషల్ మీడియా లో ఏ పోస్ట్ పెట్టిన క్షణాల్లో వైరల్ గా మారిపోతుంది .ప్రస్తుతానికి టాలీవుడ్ లో వరుసగా సినిమా చేస్తుంది . వివరాల్లోకి వెళ్తే మహేష్ బాబు తో గుంటూరు కారం , పవన కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ , బాలయ్య తో భగవత్ కేసరి ,రామ్ పోతినేని తో బోయపాటి దర్శకత్వంలో మరియు పంజా వైష్ణవ్ తేజ్ మొదలగు సినిమాలతో బిజీ గా నటిస్తుంది .
సినీ పరిశ్రమకి వచ్చిన తక్కువ కాలంలోనే వరుస ఆఫర్ లతో దూసుకుపోతుంది. తమిళం లో కూడా మంచి ఛాన్స్ లు దక్కించుకుంటోంది. శ్రీ లీలా కు ఉన్న బిజీ షెడ్యూల్ లో డేట్స్ అడ్ జస్ట్ కాకపోవడం తో స్టార్ హీరోలకు సైతం నో చెప్పేసిందట.