Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో కంటెస్టెంట్ గా వచ్చిన శ్రీసత్య మొదటి రెండు వారాలు సైలెంట్ గా ఉన్న విషయం అందరికీ తెలిసిందే..! దీనికి తోడు నేను కేవలం డబ్బుల కోసమే ఈ షోకి వచ్చాను.. నాకు ఈ టాస్కులు, గేములు ఆడటం రాదు అన్నట్లుగా చెప్పుకొచ్చింది. తీరా ఇప్పుడు మాత్రం ఓ రేంజ్ లో సేఫ్ గేమ్ ఆడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అయ్యే పాపం శ్రీసత్య అని అనుకుంటున్న అర్జున్ నే నామినేట్ చేసేంత దూరం వెళ్లిపోయింది.
ఈ వారంలో బిగ్ బాస్ ఇచ్చిన బ్యాటిల్ ఫర్ సర్వైవర్ టాస్క్ లో భాగంగా రెడ్ టీం గెలుస్తుంది. శ్రీసత్య కెప్టెన్ గా ఉన్న బ్లూటీం ఓడిపోతుంది. దీంతో ముందుగా చెప్పిన దాని ప్రకారం ఓడిపోయిన బ్లూ టీం నుండి తర్వాత వారం ఇంటి నుండి బయటికి వెళ్లేందుకు నేరుగా నామినేట్ అవుతారని బిగ్ బాస్ ప్రకటిస్తారు. దీంతో ఎవరిని నామినేట్ కు ఎంచుకోవాలి అనేదానిపై బ్లూటీం సభ్యులు డిష్కషన్ చేసుకుంటారు.
![శ్రీసత్య మాస్టర్ ప్లాన్.... ముందు నామినేషన్ కి ఒప్పుకుని తర్వాత ఏం చేసిందంటే...?! 2 SriSatya in bb6](https://rtvmedia.in/wp-content/uploads/2022/10/SriSatya-in-bb6.jpg)
బ్లూటీంలో శ్రీసత్య, అర్జున్, వాసంతి, గీతూ, మెరీన, రాజ్, రోహిత్, సూర్య ఉంటారు. వీరందరూ ముందుగా శ్రీతస్య సూచనల మేరకు చిటీల్లో పేర్లు రాసుకుని ఎవరి పేరు వస్తే వారిని నామినేషన్ కి పంపిద్దామని డిసైడ్ చేస్తారు. ఫైమా చేతుల మీదుగా అన్ని పేర్లున్న చిట్టీల నుండి ఒకటి తీస్తే అందులో శ్రీసత్య పేరు వస్తుంది. దీంతో శ్రీసత్య నామినేట్ అయ్యేందుకు ఆ రోజు రాత్రి ఒప్పుకుంటుంది.
రాత్రికి రాత్రి శ్రీసత్య ఏం మాస్టర్ ప్లాన్ వేసుకుందో ఏమో కానీ ఉదయానికి మరలా శ్రీసత్య మాట మార్చేస్తుంది. మరోసారి అందరం డిస్కషన్ చేసుకుందాం ఎవరు ఎలా ప్రదర్శన చేశారు అనే దానిపై ఓటింగ్ తీసుకుందామని చెప్తుంది. దీంతో ముందు శ్రీసత్య తన అభిప్రాయం మేరకు అర్జున్ కు ఓటు వేస్తుంది. ఇలా అందరూ ఓటింగ్ వేయగా ఎక్కువ మంది వాసంతి తక్కువ ప్రదర్శన చేసిందని ఎంపిక చేయడంతో చివరకు వాసంతి తర్వాత వారంలో హౌస్ లో నుండి బయటకు వెళ్లేందుకు నేరుగా నామినేట్ అవుతుంది.