SSMB 29: సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి నెక్స్ట్ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీపై ఇప్పటి నుంచి భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఇప్పటికే రాజమౌళికి యూనివర్శల్ లెవల్ లో మంచి గుర్తింపు వచ్చింది. దీంతో నెక్స్ట్ చేయబోయే సినిమాకి కూడా ఈ హైప్ కచ్చితంగా ఉపయోగపడుతుంది అని జక్కన్న భావిస్తున్నారు. దీంతో మహేష్ బాబుతో నెక్స్ట్ చేయబోయే సినిమాని పాన్ వరల్డ్ రేంజ్ లో తెరకెక్కించే ప్రయత్నంలో జక్కన్న ఉన్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్ తెరపైకి వచ్చింది. ఈ సినిమాని దర్శకుడు రాజమౌళి ఏకంగా వెయ్యి కోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారని టాక్. యాక్షన్ అడ్వంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూపర్ స్టార్ మహేష్ బాబు వరల్డ్ అడ్వంచర్ ట్రావెలర్ గా కనిపించబోతున్నాడు. ఈ విషయాన్ని ఇప్పటికే జక్కన్న కన్ఫర్మ్ చేసేశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా కోసం హాలీవుడ్ స్టార్ నటులని కూడా ఎంపిక చేస్తున్నారు.
ఇప్పటికే దానికోసం హాలీవుడ్ క్యాస్టింగ్ ఏజెన్సీతో ఒప్పందం కూడా చేసుకున్నారు. హాలీవుడ్ నటులు ఉంటే మూవీకి కచ్చితంగా పాన్ వరల్డ్ అప్పీల్ వస్తుంది. అప్పుడు ఇండియన్ హాలీవుడ్ మూవీగా ప్రేక్షకుల ముందుకి ఈ చిత్రం వస్తుంది. ఈ బ్రాండ్ కచ్చితంగా సినిమాని వరల్డ్ వైడ్ గా ప్రేక్షకులకి చేరువ చేస్తుందని నమ్ముతున్నారు. ఈ నేపధ్యంలోనే వెయ్యి కోట్ల బడ్జెట్ ని ఈ మూవీ కోసం పెట్టడానికి రెడీ అవుతున్నట్లు బోగట్టా. త్వరలో ఈ మూవీకి సంబందించిన ఎనౌన్స్మేంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉందని టాక్ వినిపిస్తుంది.