సోషల్ మీడియా ఎవరిని, ఎప్పుడు, ఏ విధంగా పాపులర్ చేస్తుందో ఎవరు చెప్పలేరు. ఒక్క ఫోటో ఎంతో మంది జీవితాలని మార్చేసింది. అలాగే ఒక్క వీడియో రోడ్డుపై ఉన్నవాళ్ళని తీసుకొచ్చి సెలబ్రెటీగా అందరికి పరిచయం చేసింది. ఇలాంటి అద్భుతాలు అన్నింటికీ సోషల్ మీడియా వేదిక అవుతుంది. ఎవరో తీసిన ఫోటో ఇంకెవరికో నచ్చుతుంది. దానికి వారు షేర్ చేస్తారు. అలా అది కాస్తా వైరల్ అవుతుంది. సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇప్పుడు అలాంటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది.
పట్టణాలలో ఏ జంక్షన్ లో చూసిన బిచ్చగాళ్ళు మనకి తారసపడుతూ ఉంటారు. సిగ్నల్ పడగానే వారు మన తన బిక్షాటన మొదలు పెడతారు. అన్ని అవయవాలు బాగున్నవారు కూడా బెగ్గింగ్ ని ఒక ప్రొఫెషన్ గా మార్చేసుకుంటున్నారు. ఇండియాలో అడుక్కున్న వారికి దానం చేస్తే పుణ్యం అనే సెంటిమెంట్ ఇలాంటి వారు ఎక్కువ మంది కావడానికి కారణం అవుతుంది. ప్రజలు కూడా బిచ్చగాళ్ళు కనిపించగానే ఎవరికి తోచిన స్థాయిలో వారు సాయం చేస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో బిచ్చగాళ్ళు కూడా బాగా అప్డేట్ అయ్యారు.
ఏకంగా డిజిటల్ పేమెంట్ ని కూడా తీసుకుంటున్నారు. అలాగే కొంత మంది స్టైలిష్ బిచ్చగాళ్ళు కూడా మనకి తారసపడుతూ ఉంటారు. ఇప్పుడు అలాంటి స్టైలిష్ బెగ్గర్ ఫోటోని ఢిల్లీ వీధుల్లో ఒకరు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ ఫోటోని షేర్ చేస్తూ సదరు వ్యక్తి బాలీవుడ్ హీరోలా స్టైలిష్ గా ఉన్నాడంటూ వ్యాఖ్యలు పెట్టారు. ఇది కాస్తా వైరల్ కావడంతో ఆ బెగ్గర్ ని కొందరు హృతిక్ రోషన్ తో మరికొందరు, ఆదిత్యా రాయ్ కపూర్ తో పోల్చడం విశేషం. ఢిల్లీ బెగ్గర్ స్టైలిష్ గా మారారు అంటూ ఫన్నీగా పోస్టులు పెడుతున్నారు. మొత్తానికి ఒక్క పోస్ట్ తో ఆ బెగ్గర్ కి సోషల్ మీడియాలో ఎక్కడ లేని పాపులారిటీ వచ్చేసింది