సుడిగాలి సుధీర్‌కు బుల్లితెరపై ఉన్న క్రేజ్, డిమాండ్ మరేఇతర సెలెబ్రిటీలెవ్వరికీ లేదు. హైపర్ ఆది, అనసూయ, రష్మీ ఇలా ఎంత మంది ఉన్నా కూడా సుధీర్ రేంజ్ వేరే. కెరీర్ ప్రారంభంలో సుధీర్ రష్మీ అంటూ జంటగా ఫేమస్ అయ్యారు. కానీ సుధీర్ మల్టీ టాలెంట్‌తో స్టార్‌గా ఎదిగిపోయాడు. సింగింగ్, డ్యాన్సింగ్, యాక్షన్ స్టంట్స్, హోస్ట్, హీరో, కారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా అన్ని రకాలుగా సుధీర్ తన టాలెంట్‌ను అందరికి చూపించాడు.
బుల్లితెరపై సుధీర్ లేని షో హిట్ కాదు అనే టాక్ వచ్చింది. సుధీర్ కనిపిస్తే చాలు ఆ షో హిట్ అవుతుంటుంది అనే సెంటిమెంట్ వచ్చింది . కానీ ఈ మధ్య సుధీర్ కొన్ని షోలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. పండుగకు వచ్చే స్పెషల్ ఈవెంట్లలో సుధీర్ కనిపించడం లేదు. ఢీ షో నుంచి సుధీర్‌ను తప్పించారంటూ కథనాలు కూడా వచ్చాయి. సుధీరే కావాలని ఢీ నుంచి వెళ్లిపోయాడంటూ ఇంకొందరు చెపుతున్నారు.
కానీ సుధీర్ ఢీ నుంచి వెళ్లిపోవడం మాత్రం ఆ షోకి పెద్ద దెబ్బే తగిలింది. సుధీర్ కనిపించకపోవడంతో ఆ షోను ఎవ్వరూ చూడటం మాసేసారు. రేటింగ్స్‌లో ఢీ మరీ దారుణమైన స్థితిలోకి వెళ్లిపోయింది. ఆ షో నుంచి సుధీర్ బయటకు రావడానికి గల కారణాలను సుధీర్ ఇంత వరకు కూడా చెప్పలేదు. కానీ తాజాగా ఓ స్కిట్లో భాగంగా అసలు విషయాన్ని చెప్పుకొచ్చాడు సుదీర్.
డేట్స్ అడ్జస్ట్ అవ్వడం లేదని ఢీ మానేశాను అని ఆదితో కలిసి వేసిన స్కిట్లో సుధీర్ చెప్పకనే చెప్పాడు. అసలే సుధీర్ ఈ మధ్య సినిమాలతో ఫుల్ బిజీ అయ్యాడు. రెండు సినిమాలను లైన్లో పెట్టాడు. కాలింగ్ సహస్ర అనే సినిమా ఎప్పటి నుంచో లైన్లో ఉంది. ఇక గాలోడు సినిమాను మాత్రం ముందుగా పూర్తి చేసేందుకు సుధీర్ బిజీ బిజీగా తిరుగుతున్నాడు.