Sundeep Kishan: టాలీవుడ్ లో టాలెంటెడ్ యాక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న హీరో సందీప్ కిషన్. ప్రస్థానం సినిమాతో కెరియర్ ప్రారంభించిన సందీప్ కిషన్ తరువాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుస సినిమాలు చేస్తూ బిజీ యాక్టర్ అయిపోయాడు. అయితే యంగ్ హీరోగా వరుసగా సినిమాలు చేస్తున్న కూడా అతన్ని సక్సెస్ మాత్రం కరెక్ట్ గా పలకరించడం లేదని చెప్పాలి. కెరియర్ లో ఇప్పటికే బ్లాక్ బస్టర్ హిట్ అంటే వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మాత్రమే. అలాగే మినిమమ్ రేంజ్ హిట్స్ గా రెండు సినిమాలు ఉన్నాయి. మిగిలినవి అన్ని కూడా ఎవరేజ్, డిజాస్టర్ టాక్ ని తెచ్చుకున్నాయి.
ఇదిలా ఉంటే సందీప్ కిషన్ పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కొట్టేందుకు మైఖేల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. భారీ హైప్ ఇచ్చిన ఈ సినిమా మీద సందీప్ గట్టిగానే ఆశలు పెట్టుకున్నాడు. లైఫ్ లో తనకి కరెక్ట్ గా సరిపోయే పాత్రని ఈ మూవీలో చేసానని గొప్పగా చెప్పుకున్నడు. అయితే రిలీజ్ తర్వాత ఈ మూవీ పూర్తిగా తేలిపోయింది. ప్రేక్షకులని ఏ మాత్రం ఆకట్టుకోలేదు. దీంతో డిజాస్టర్ సినిమాల జాబితాలోకి వెళ్ళిపోయింది. సందీప్ కిషన్ గత సినిమాలు ఫస్ట్ డే ఓపెనింగ్స్ అయినా తెచ్చుకున్నాయి.
అయితే ఈ మూవీ ఆ స్థాయిలో కూడా రాలేదు. సినిమాని పైకి లేపి ఇచ్చిన హైప్ ఏ మాత్రం వర్క్ అవుట్ కాలేదు. విజయ్ సేతుపతి, వరలక్ష్మి లాంటి స్టార్స్ ఉన్నా కూడా సినిమాకి ఓపెనింగ్స్ రాకపోవడం విశేషం. అయితే నెక్స్ట్ ఎలా అయిన బలంగా హిట్ కొట్టాలని కసితో ఉన్న సందీప్ కిషన్ తనకి మొదటి అవకాశం ఇచ్చిన దర్శకుడు దేవకట్టాతో మూవీకి కమిట్ అయ్యాడు.
దేవకట్టా సినిమాలు అన్ని కూడా సోషల్ ఎలిమెంట్స్ తో ఉంటాయి. ఈ ప్రస్తుతం అలాంటి కాన్సెప్ట్ లకి డిమాండ్ ఉంది. ఈ నేపధ్యంలో దేవకట్టాతో సరైన బ్లాక్ బస్టర్ కొట్టాలని అనుకుంటున్నారు. దేవకట్టా కూడా రిపబ్లిక్ తర్వాత పెద్ద హీరోలు అవకాశాలు ఇవ్వకపోవడంతో సైలెంట్ అయిపోయాడు. ఈ నేపధ్యంలో సందీప్ కిషన్ తో దొరికిన ఛాన్స్ ని కరెక్ట్ గా వాడుకొని సరైన హిట్ తో ప్రూవ్ చేసుకోవాలని అనుకుంటున్నారు.