Sunny Leone: అశ్లీల సినిమాలు చేసే ఓ పోర్న్ స్టార్ ఇప్పుడు అవన్నీ మానేసి సినిమాలు చేస్తూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుంది. ఆ హీరోయిన్ ఎవరో మనందరికి తెలిసిందే.. సన్నీ లియోన్. బాలీవుడ్ హర్రర్ సినిమా ద్వారా సినీ పరిశ్రమకు పరిచయం అయిన సన్నీ లియోన్.. తర్వాత ఇతర భాషల్లోనూ నటిస్తూ గుర్తింపు తెచ్చుకుంది.
తెలుగులో కూడా సన్నీ లియోన్ పలు సినిమాల్లో నటించి, హీరోయిన్లకు తాను ఏమాత్రం తక్కువ కాదని నిరూపించింది. గరుడ వేగ సినిమాలో డియో డియో డిసకడిసక అంటూ తెలుగు జనాలను ఊపేసిన సన్నీ లియోన్ అప్పుడప్పుడు తెలుగు సినిమాల్లో సందడి చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ఈమె మంచు విష్ణు హీరోగా చేసిన జిన్నా సినిమాలో నటించింది.
అశ్లీల సినిమాలను పూర్తిగా మానేసి ఇప్పుడు ఓ మంచి హీరోయిన్ గా, స్పెషల్ ఐటెం సాంగ్స్ లో డ్యాన్స్ తో అందరినీ ఆకట్టుకుంటోంది. తన భర్త, పిల్లలతో కలిసి హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న సన్నీ లియోన్ తాను షూటింగ్ చేసేటప్పుడు కొన్ని కండీషన్లు పెడతానని వెల్లడించింది. అవి పాటిస్తేనే సినిమా షూటింగ్ చేస్తానని వెల్లడించింది.
Sunny Leone:
సన్నీ లియోన్ సినిమా షూటింగ్ లో భాగంగా గ్లామర్ షాట్స్ తీసేటప్పుడు కొన్ని కండీషన్లు పెడుతుందట. గ్లామర్ సీన్ల షూటింగ్ టైంలో అక్కడ సెట్ లో పిల్లలు ఉండకూడదట. పిల్లలు ఉంటే తాను షూట్ కు ఒప్పుకోదట. అవసరమైతే షూటింగ్ కు నో అయినా చెబతా కానీ యాక్ట్ చేసే ప్రసక్తే లేదని సన్నీ లియోన్ అంటోంది. మొత్తానికి పిల్లల విషయంలో సన్నీ లియోన్ పెట్టిన కండీషన్ అందరినీ ఆకట్టుకుంటోంది.