టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. గత ఏడాది అనారోగ్య సమస్యలతో స్వర్గస్తులైన విషయం తెలిసిందే. ఇక సినీ ఇండస్ట్రీకి ఎన్నో మరెన్నో టెక్నాలజీలను పరిచయం చేసి అంతకుమించిన అరుదైన మైలురాయిను కూడా ఆయన సాధించారు. అనేక పాత్రలలో దాదాపు 350 సినిమాలలో పైగా నటించిన కృష్ణ అరుదైన గుర్తింపును కూడా సొంతం చేసుకున్నారనే చెప్పాలి. ఇకపోతే ఒకానొక సందర్భంలో తన కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడు ఒకే ఏడాది ఏకంగా ఆయన నటించిన 17 సినిమాలు విడుదలై మరొక రికార్డు కూడా సృష్టించాడని చెప్పాలి.
ఇకపోతే కృష్ణ హీరోగా నటించిన చిత్రాలలో తేనె మనసులు తొలి సినిమా కాగా.. ఈనాడు సినిమా 100వ చిత్రంగా తెరకెక్కింది. ఇక అల్లూరి సీతారామరామరాజు రెండు వందల చిత్రం కాగా తెలుగువీర లేవరా అనే చిత్రం 300 వ చిత్రం గా అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీతో సంచలనాలు సృష్టిస్తున్న సమయంలోనే దాదాపు అంతే ప్రజాదారణ ఉన్న కృష్ణకి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిందని సమాచారం. అంతేకాదు ఏలూరు నుంచి ఒకసారి ఎంపీగా కూడా గెలిచిన కృష్ణ తానూ బై ఎలక్షన్లలో ఓడిపోయారు.
ఇక సినిమా రంగానికి వస్తే ఆయన చేసిన సేవకు , కృషికి గాను కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ అవార్డును కూడా అందించింది. అంతేకాదు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ కూడా పొందారు . అడవి సింహాలు, అల్లూరి సీతారామరాజు, అగ్నిపర్వతం సినిమాలలో ఆయన నటనకు గానూ బెస్ట్ యాక్టర్ గా ఫిలింఫేర్ అవార్డులు చాలా లభించాయి. ఇక సినిమా రంగానికి ఆయన చేసిన సేవలకు గాను ఎన్టీఆర్ నేషనల్ అవార్డు కూడా ఇచ్చారు . వీటితోపాటు మరెన్నో అవార్డులు ఆయన సొంతం చేసుకున్నారు.