బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ పెళ్లయిన మూడు నెలల తర్వాత తన ప్రెగ్నెంట్ అని వెల్లడించింది. తాజాగా ఆమె ప్రెగ్నెంట్ అని తెలుపుతూ.. సోషల్ మీడియాలో బేబీ బంప్‌తో తన భర్త ఒడిలో కూర్చుని ఉన్న ఫొటోని షేర్ చేసింది. అంతేకాదు అక్టోబర్‌లో బేబీ అంటూ తను బేబీకి జన్మనిచ్చే తేదీని కూడా వెల్లడించింది. ఆమె పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఈ హీరోయిన్‌కి పెళ్లయి మూడు నెలలు. ఆ పెళ్లి విషయంలో కూడా ఆమె హాట్ టాపిక్‌గా నిలిచింది. ఇప్పుడేమో బేబీ బంప్‌తో దర్శనమిచ్చి.. అక్టోబర్‌లో బేబీ అంటోంది. దీంతో ఆమె పోస్ట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇంతకీ ఎవరా హీరోయిన్ అనుకుంటున్నారా? బాలీవుడ్ నటి స్వరా భాస్కర్
తాజాగా ఆమె ఇన్‌స్టా వేదికగా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మూడు నెలల క్రితం స్వరా భాస్కర్.. సమాజ్ వాదీ పార్టీ నేత ఫహాద్ జిరార్ అహ్మద్ ను ముందు రిజిస్టర్ మ్యారేజ్.. ఆ తర్వాత నార్మల్‌గా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. పెళ్లి సమయంలో కూడా స్వరా భాస్కర్‌పై ఓ రేంజ్లో వార్తలు వైరల్ అయ్యాయి. మళ్లీ ఇన్నాళ్లకు సోషల్ మీడియాలో బేబీ బంప్‌తో దర్శనమివ్వడంతో మరోసారి ఆమె వార్తలలో హైలెట్ అవుతోంది.