Taapsee: టాలీవుడ్ లో ఝుమ్మందినాదం సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాలోనే గ్లామర్ తో కట్టిపడేసిన అందాల భామ తాప్సి పొన్ను. ఈ పంజాబీ ముద్దుగుమ్మ మొదటి సినిమా తర్వాత టాలీవుడ్ లో కమర్షియల్ హీరోయిన్ గా మారిపోయి వరుస అవకాశాలు సొంతం చేసుకుంది. అయితే ఆమెని టాలీవుడ్ దర్శకులు కేవలం గ్లామర్ రోల్స్ కి మాత్రమే పరిమితం చేశాడు. చాలా కాలం తన టాలెంట్ ని చూపించుకునే పాత్రల కోసం తెలుగులో వెయిట్ చేసి ఇక ఫైనల్ గా హిందీలోకి వెళ్ళిపోయింది.
ఇక హిందీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసగా ఫిమేల్ సెంట్రిక్ కథలతో సినిమాలు చేస్తూ తాప్సి హిట్స్ మీద హిట్స్ కొట్టింది. దీంతో సోలో హీరోయిన్ గా మారిపోయి ఏకంగా బయోపిక్ కథలని కూడా చేసింది. మిథాలీ రాజ్ బయోపిక్ లో కూడా తాప్సీ నటించడం విశేషం. ఇప్పటికీ ఈ అమ్మడు హిందీలో ఫిమేల్ సెంట్రిక్ కథలకి కేరాఫ్ అడ్రెస్ గా ఉంది.
హిందీలో ఉంటే ఇప్పుడు ఈ బ్యూటీ హిందీలో ఏకంగా షారుఖ్ ఖాన్ కి జోడీగా డుంకీ అనే సినిమాలో నటిస్తుంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం జరుగుతుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాదిలో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే చాలా కాలంగా సోషల్ మీడియాకి దూరంగా ఉన్న తాప్సీ మరల యాక్టివ్ అయ్యింది.
తాజాగా ఈ అమ్మడు ర్యాంప్ పై వాక్ చేసిన హాట్ ఫోటోలని ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఓ ఫ్యాషన్ ఈవెంట్ లో డిఫరెంట్ స్టైల్ గోల్డ్ జ్యూయిలరీ ధరించిన తాప్సీ రెడ్ కలర్ గౌన్ లో ర్యాంప్ పై మెరిసింది.
ఈ ఫోటోలలో ఆమె ఎద అందాలు పూర్తిగా చూపిస్తూ గ్లామర్ షోతో రెచ్చిపోయింది. వదులైన డ్రెస్ వేసిన తాప్సీ అందాలు ఏ మాత్రం అడ్డు తొలగిన కనిపించే విధంగా ఉండటం విశేషం. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.