NTR : తాత నందమూరి తారక రామారావు పేరునే కాదు.. నట వారసత్వాన్ని.. అందాన్ని కూడా పుణికి పుచ్చుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్‌ను సంపాదించుకున్నాడు. బాల రామాయణం సినిమాలో బాల నటుడిగా అలరించిన ఎన్టీఆర్.. ఆ తరువాత 2001లో ‘నిన్ను చూడాలని’ సినిమాతో సోలో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు. వీఆర్ ప్రతాప్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఫ్లాప్ అయింది. కానీ ఎన్టీఆర్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తరువాత వచ్చిన స్టూడెంట్ నం 1.. సినిమాలో నటించాడు. ఇక తారక్ కెరీర్‌కి టర్నింగ్ పాయింట్ అంటే సింహాద్రి.
ఇక ఆ తరువాత ‘ఆది’వంటి సినిమాలతో తారక్ తిరుగులేని స్టార్‌గా ఎదిగాడు. ఇక యమదొంగ సినిమాతో స్లిమ్ అయిపోయాడు ఎన్టీఆర్. దీంతో ఆయన క్రేజ్ మరింత పెరిగింది. ఇక తాజాగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు పొందాడు. ఇక తారక్ నెక్ట్స్ సినిమాలపై అంచనాలు విపరీతంగా పెరిగాయి. ఇప్పటికే ఎన్టీఆర్ తన 30వ సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్నట్లు ప్రకటించాడు. తాజాగా ఎన్టీఆర్ ఆరోగ్యం గురించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఎన్టీఆర్ అనారోగ్యం బారిన పడ్డాడని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం భుజం నొప్పితో బాధపడుతున్నాడని.. కనీసం నాలుగు వారాలైనా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు కథనాలు వెలువడుతున్నాయి.
NTR : ఎన్టీఆర్ ఆరోగ్యం గురించి ఆందోళన
ఎన్టీఆర్ అనారోగ్యం కారణంగా కొరటాల సినిమా షూటింగ్ కొంతకాలం వాయిదా పడనుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం ఊపందుకుంది. విషయం తెలుసుకున్న అభిమానులు ఎన్టీఆర్ ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడట. ఇప్పటికే కొరటాల శివను మంచి స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పాడట. ఈ స్క్రిప్ట్ రెడీ అయ్యేలోపు తన ఫ్యామిలీతో కలిసి హాలీడే టూర్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఎన్టీఆర్30 మూవీని కల్యాణ్ రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్, హరికృష్ణ, ఎన్టీఆర్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్ సంయుక్తంగా నిర్మించనున్నారు.