బ్రహ్మానందం రెండో కోడలు
టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్రహ్మానందం కమెడియన్ గా వందలాది సినిమాల్లో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు బ్రహ్మానందం కూడా ఒకరు. తెలుగు సినీ పరిశ్రమలో కమెడీయన్ పాత్రల్లో నటిస్తూ తన అద్భుతమైన కామెడీ టైమింగ్ పంచ్ డైలాగ్ లతో ఎంతో పేరును సంపాదించుకున్న బ్రహ్మానందం ప్రస్తుతం సినిమాలకు కాస్త దూరమయ్యానే చెప్పుకోవచ్చు . దాదాపు 1300కి సినిమాల్లో నటించారట బ్రహ్మానందం.
![బ్రహ్మానందం రెండో కోడలు బ్యాగ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్యపోతారు..! 2 బ్రహ్మానందం రెండో కోడలు బ్యాగ్రౌండ్ తెలిస్తే ఆశ్చర్యపోతారు..!](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-7-2.jpg)
అంతేకాదు.. 2009లో ఆయనకు పద్మశ్రీ పురస్కారం, గిన్నీస్ రికార్డులోకి ఎక్కారు. అలాంటి బ్రహ్మానందం కుటుంబం విషయం లోకి వస్తే.. ఆయనకు ఇద్దరు కుమారులు. పెద్ద కొడుకు గౌతమ్ పల్లకిలో పెళ్లి కూతురు సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చి అందరికీ పరిచయమయ్యారంట . ఇక ఆ తరువాత మను, బాసంతి సినిమాల్లో నటించారు. ఆ సినిమాలు అట్టర్ ఫ్లాప్ కావడంతో ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇక బ్రహ్మానందం చిన్న కొడుకు బయటి ప్రపంచానికి పెద్దగా కనిపించలేదు. తాజాగా ఆయన పెళ్లి జరిగింది. అయితే ఎంగేజ్మెంట్ జరిగేంత వరకు కూడా బ్రహ్మానందం రెండో కొడుకు ఉన్నాడనే విషయం చాలా మందికి తెలియదంట .
బ్రహ్మానందం ఇంట్లోకి రెండో కోడలుగా అడుగు పెట్టిన అమ్మాయికి బ్యాగ్రౌండ్ బాగానే ఉందట. ఆమె కరీంనగర్ లో ప్రముఖ డాక్టర్స్ పద్మజా వినయ్ ల కుమార్తే అని ఆమె పేరు ఐశ్వర్వ. ఆమె కూడా గైనకాలజిస్ట్ డాక్టర్. వీరికి ఆస్తులు కూడా బాగానే ఉన్నట్టు సమాచారం. అందంగా ఉండే ఐశ్వర్య పేరిట ఆమె తల్లిదండ్రులు కొన్ని కోట్ల ఆస్తులను కూడబెట్టారని తెలుస్తోంది. బ్రహ్మానందం స్థోమతకు తగినట్టు ఉంటారని బ్రహ్మానందం ఒకే చెప్పినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. దీనికి సీఎం కేసీఆర్ తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.