చంద్రముఖి 2ని రజనీకాంత్
సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరమే లేదు. రజినీకాంత్ తన కెరీర్ లో చాలా సినిమాలు చేశారు. అందులో బ్లాక్ బస్టర్స్ హిట్స్ కూడా చాలానే ఉన్నాయి. కానీ ఆయన మూవీ ల్లో అన్నింటి కంటే చంద్రముఖికి ప్రత్యేక స్థానం ఉంది. మలయాళం వచ్చిన మణిచిత్రతరాజు సినిమా అఫీషియల్ రీమేక్ గా ఇది లభించింది. ఆడియన్స్ ఒరిజినల్స్ వెర్షన్ కంటే.. చందముఖికే ఎక్కువ ప్రాధాన్యత ను ఇచ్చారు.
![చంద్రముఖి 2ని రజనీకాంత్ రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటో తెలుసా ? 2 చంద్రముఖి 2ని రజనీకాంత్ రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటో తెలుసా ?](https://rtvmedia.in/wp-content/uploads/2023/08/Untitled-design-2023-08-29T125027.392.jpg)
అంతేకాదు.. సినీ పరిశ్రమలో హర్రర్ కామెడీ సినిమాలు ఇలా ఉండాలనేవిధంగా చంద్రముఖి సినిమా ప్రత్యేకముద్ర వేసుకుంది. అయితే ఇప్పుడు చంద్రముఖికి సీక్వెల్ గా చంద్రముఖి 2ని డైరెక్టర్ పి. వాసు తెరకెక్కించాడంట . సెప్టెంబర్ 15న విడుదల కాబోతుంది. దీనిలో మునితోపాటు కాంఛన వంటి హర్రర్ కమెడీ మూవీ లలో నటించిన లారెన్స్ హీరోగా చేస్తున్నాడు. చంద్రముఖి 2లో రజనికాంత్ ఎందుకు నటించడం లేదు ? ఈ స్టోరీని రజినీకాంత్ ఎందుకు తెస్తున్నారు అనే ప్రశ్నలు ఈ ప్రాజెక్ట్ స్టార్ అయిన నాటి నుంచి వస్తున్నాయి. ఎట్టకేలకు ఈ ప్రశ్నలకు సమాధానం కూడా లభించింది. స్వయంగా దర్శకుడు పి.వాసు ఈ ప్రశ్నలకు సమాధానం ఇచ్చాడు
చంద్రముఖి 2 స్టోరీని దర్శకుడు పి.వాసు రెడి చేసి తొలుత రజినీకాంత్ వద్దకు వెళ్లారంట . రజినీకాంత్ కూడా చాలా ఆసక్తిగా స్టోరీ మొత్తం విన్నారంట . అంతేకాదు.. స్టోరీ చాలా బాగుంది.. మంచి విజయం సాధిస్తుందని చెప్పారట. అంతేకాదు.. స్టోరీ చాలా బాగుందని మంచి విజయం సాధిస్తుందని కూడా చెప్పారట. కానీ ఈ స్టోరీకి తనకంటే రాఘవ లారెన్స్ చాలా బాగా సెట్ అవుతాడని దర్శకుడు పి.వాసుకి చెప్పారట.లారెన్స్ పేరును స్వయంగా రజినీకాంత్ సిఫారసు చేయడంతో పి.వాసు లారెన్స్ ని సంప్రదించారట. సూపర్ హిట్ సినిమా కీ సీక్వెల్.. అందులో కూడా సూపర్ స్టార్ రజినీకాంత్ చేసిన పాత్ర ఒకటి .. మళ్లీ ఆయనే చేయమని చెప్పడంతో లారెన్స్ నో చెప్పకుండా చంద్రముఖికి వెంటనే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారట. చంఖి 2 రజినీకాంత్ నుంచి రాఘవలారెన్స్ వరకు వచ్చింది.