నటుడు అరవింద్ స్వామి గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసర లేదు. డాక్టర్ కావాలనుకున్న అరవింద్ స్వామి అనుకోకుండా యాక్టర్ గా మారడు. రోజా, బొంబాయి వంటి చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. స్టార్ హీరోగా ఎదుగుతున్న సమయంలోనే సినిమాలకు సడెన్ గా బ్రేక్ ఇచ్చాడు .2000 సంవత్సరంలో వ్యాపారరంగంలోకి అడుగు పెట్టాడు. తన తండ్రి వ్యాపారలను చూసుకోడం మొదలుపెట్టాడు.ఆటు మెల్లగా సొంతంగా టాలెంట్ మాక్సిమస్`అనే సంస్థను ప్రారంభించాడు.ఒక కన్సల్టెన్సీ సంస్థలా ఇది పనిచేస్తుంది. ఇప్పటికీ ఈ కంపెనీని అరవింద్ స్వామి నడిపించడం గమనార్హం. .
![స్టార్ హీరోలని మించిన అరవింద్ స్వామి ఆస్తుల విలువ! అన్నివేల కోట్ల ? 2 స్టార్ హీరోలని మించిన అరవింద్ స్వామి ఆస్తుల విలువ! అన్నివేల కోట్ల ?](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/Untitled-design-2023-07-06T180652.684.jpg)
అరవింద్ స్వామి :
ప్రస్తుతం అరవింద్ స్వామికి సంబందించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది అదేంటంటే అరవింద్ స్వామి ఆస్తుల విలువ దాదాపు రూ. 4,000 కోట్లు ఉంటుందని సమాచారం . కేవలం టాలెంట్ మాక్సిమస్ కంపెనీ విలువే రూ. 3,300 కోట్లు ఉంటుందని అంచనా. మరోవైపు చెన్నైలో అరవింద్ స్వామికి ఒక హాస్పిటల్ ఉంది. తన తండ్రి నుంచి వచ్చిన ఆస్తులతో పాటు అరవింద్ స్వామి సంపాదించిన ఆస్తుల విలువ మొత్తం కలిపి నాలుగు వేల కోట్లు ఉంటుందని పలు నివేదికల అంచనా. ఈ విషయం తెలిసి అరవింద్ స్వామి అభిమానులు స్టార్ హీరోలు కూడా ఆస్తుల విషయంలో తక్కువే అని కామెంట్స్ చేస్తున్నారు.