ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం “పుష్ప 2 ది రూల్” కోసం అందరికీ తెలిసిందే. మరి పుష్ప 1 భారీ హిట్ కావడంతో పుష్ప 2 పై మంచి హైప్ ఉంది. అయితే దీనిని సినిమా ఫస్ట్ గ్లింప్స్ సహా ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో నెక్స్ట్ లెవెల్లోకి వెళ్ళింది. ఇక ఈ సినిమాపై ఇప్పుడు ఓ క్రేజీ న్యూస్ అయితే తెలుస్తుంది.
ఫస్ట్ పార్ట్ ఎండింగ్ లో పుష్ప రాజ్ అలాగే భన్వర్ సింగ్ షెకావత్ మధ్య ఎపిక్ ఫేస్ ఆఫ్ అలాగే ఇద్దరి ఈగో మధ్య పార్ట్ 2 లో గట్టిగా యుద్ధం ఉంటుంది అని అర్ధం అయ్యింది. అయితే పార్ట్ 2లో ఇప్పుడు సాలిడ్ సీక్వెన్స్ లు ఇద్దరి మధ్య చాలా ఎంగేజింగ్ గా ఉంటాయట. పుష్ప రాజ్ అలాగే భన్వర్ నడుమ ఘర్షణ సన్నివేశాలు సాలిడ్ గా డిజైన్ చేశారట. దీనితో పార్ట్ 2లో ఎపిక్ ఫేస్ ఆఫ్ ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది అని చెప్పాలి.
![“పుష్ప 2″లో మరింత బలంగా వారిద్దరి సీన్స్. 2 “పుష్ప 2″లో మరింత బలంగా వారిద్దరి సీన్స్](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/9d0be3f4-bb26-4bc0-8840-1ae0b3e9ccd3.jpg)