ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా దర్శకుడు త్రివిక్రమ్ తో “గుంటూరు కారం” అనే సాలిడ్ మాస్ డ్రామా చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండగా మొన్న గ్లింప్స్ తో అదిరే హైప్ ని కూడా తెచ్చుకుంది. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం నుంచి మరో క్రేజీ అప్డేట్ ని మహేష్ బర్త్ డే కానుకగా ఈ ఆగస్ట్ లో మేకర్స్ ఆల్రెడీ ఫిక్స్ చేసారు.
![ఈసారి మహేష్ బర్త్ డే కి బంపర్ గిఫ్ట్ గా ..? 2 ఈసారి మహేష్ బర్త్ డే కి బంపర్ గిఫ్ట్ గా ..?](https://rtvmedia.in/wp-content/uploads/2023/07/08.jpg)
దీనితో పాటుగా సూపర్ స్టార్ మాస్ హిట్ చిత్రం “బిజినెస్ మెన్” రీ రిలీజ్ తో అయితే నెక్స్ట్ లెవెల్లో వేడుకలు ఉంటాయని తెలుస్తుంది. బిజినెస్ మెన్ సినిమా 4కే రీ మాస్టర్ పనులు శరవేగంగా జరుగుతుండగా మేకర్స్ అయితే మహేష్ బర్త్ డే కి బిజినెస్ మెన్ సినిమా రీ రిలీజ్ తో బిగ్గెస్ట్ బర్త్ డే బ్లాస్ట్ ఎవర్ గా అదిరిపోతుందని ప్రామిస్ చేస్తున్నారు. ఇక దీనితో హంగామా ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రాన్ని మాస్ దర్శకుడు పూరి జగన్నాథ్ తెరకెక్కించగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. అలాగే థమన్ సంగీతం అందించాడు.