వరుణ్ ధావన్ హీరోగా హిందీలో తెరకెక్కిన సినిమా బెదియా. కృతి సనన్ ఈ మూవీలో హీరోయిన్ గా నటించింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇక ఈ సినిమాలో ఇండియన్ ఇండస్ట్రీలో ఇప్పటి వరకు రానటువంటి ఎలిమెంట్ ని దర్శకుడు ఎంచుకున్నాడు. ఒక తోడేలు టైటిల్ తో ఈ మూవీ తెలుగులో డబ్బింగ్ అయ్యి రిలీజ్ అయ్యింది. యాక్షన్, కామెడీ గా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీ తాజాగా ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ మధ్యకాలంలో బాలీవుడ్ లో సరైన హిట్స్ పడటం లేదు. ఇలాంటి సమయంలోనే తోడేలు సినిమాలు రిలీజ్ అయ్యింది. చిన్న సైజు రోడ్డు కాంట్రాక్టర్ గా ఉన్న హీరోగా అర్ధరాత్రి అడవిలో ఓ తోడేలు కరిచేస్తుంది. దాంతో అతనికి కూడా తోడేలు లక్షణాలు వచ్చేస్తాయి.
రాత్రి సమయాలలో అడవిలోకి వెళ్లి ఆ ఫారెస్ట్ ని ధ్వంసం చేయాలని చూసే అందరిని హీరో చంపేస్తూ ఉంటాడు. ఇక తోడేలుగా మారిన అతను అలా ఎందుకు చేస్తున్నాడు. ఇక ఆ లక్షణాలతో అతను శాశ్వతంగా తోడేలు మాదిరిగానే ఉండిపోయాడా, లేదంటే వెటర్నరీ డాక్టర్ కృతి సనన్ సాయంతో మళ్ళీ మామూలు మనిషిగా మారాడా అనేది కథలో కీలకంగా ఉంది. అడవులని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని పర్యావరణ వేత్తలు ఓ వైపు ప్రజలలో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే కాన్సెప్ట్ ని తీసుకొని అందులో తోడేలు పాత్రతో కథని చెప్పే ప్రయత్నం దర్శకుడు చేశాడు. ఇలా ఒక మనిషి తోడేలుగా మారడం అనేది కొత్త పాయింట్ అయిన కూడా మిగిలిన ఎలిమెంట్స్ అన్ని కూడా రెగ్యులర్ గా అనిపిస్తాయి.
ఇక సినిమాలో వరుణ్ ధావన్ ఓ వైపు కామెడీ పండిస్తూనే, తోడేలుగా మారే సన్నివేశాలలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో మెప్పించాడు. కృతి సనన్ పాత్ర గురించి పెద్దగా చెప్పడానికి ఏమీ లేదు. మిగిలిన పాత్రలు చేసిన వారు ఎవరి పరిధి మేరకు వారు బాగానే నటించారు. కథలో అక్కడక్కడ కాంతారా ఛాయలు కనిపిస్తాయి. అయితే నేరేషన్ విషయంలో ఆడియన్స్ కి బోర్ కొట్టిస్తుంది. తెలుగు డబ్బింగ్ కావడంతో ఇక్కడి ప్రేక్షకులకి డైలాగ్స్ పెద్దగా ఆకట్టుకోవు. ఉన్నంతలో పర్వాలేదనిపించే విధంగా ఉన్న కమర్షియల్ గా ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందనేది చెప్పలేని పరిస్థితి. పాటలు, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పెద్దగా ఆకట్టుకోలేదు. నిర్మాణ విలువలు మెచ్చుకోదగ్గ విధంగా ఉన్నాయి. దర్శకుడు అమర్ కౌశిక్ ఎంచుకున్న లైన్ కొత్తగా ఉన్న దాని ట్రీట్మెంట్ విషయంలో తడబడ్డాడు అనే మాట వినిపిస్తుంది. ఓవరాల్ లో సౌత్ ప్రేక్షకులని అయితే తోడేలు కాంతారా స్థాయిలో మెప్పించకపోవచ్చు అనే మాట వినిపిస్తుంది.